పుస్తకాలుంటే.. ఆ మూడు మంచి లక్షణాలు

17 Oct, 2018 01:10 IST|Sakshi

పుస్తకాలు చదివితే ఏమొస్తుందని కొందరంటారుగానీ ఆస్ట్రేలియన్‌ నేషనల్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు మాత్రం కనీసం మూడు ప్రయోజనాలు ఉన్నాయని తేల్చేస్తున్నారు. చిన్నతనం నుంచి పుస్తకాలతో సావాసం చేసిన వాళ్లకు అంకెలు, సమస్య పూరణాలతోపాటు మేధావితనపు సంస్కారం అలవడతాయని వీరు అంటున్నారు. 2011 నుంచి 2015 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.60 లక్షల మందిని సర్వే చేసి మరీ ఈ అధ్యయనం చేశామని జోవానా సికోరా తెలిపారు.

సర్వేలో పాల్గొన్న వాళ్లు 25– 65 మధ్య వయస్కులు. పదహారేళ్ల వయసు వచ్చేలోపు ఇంట్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? అన్న ప్రశ్నకు వీరంతా సమాధానమిచ్చారు. నార్వే, స్వీడన్, చెచ్నియా వంటి దేశాల్లోని పిల్లల ఇళ్లలో సగటున 200 పుస్తకాలు ఉండగా చిలీ, సింగపూర్, టర్కీ వంటి దేశాల్లో ఈ సంఖ్య 60 మాత్రమే. అందుబాటులో ఉన్న పుస్తకాల సంఖ్యకు తగ్గట్టుగానే ఆయా దేశాల యువకుల మేధోశక్తి కూడా ఉన్నట్లు ఈ పరీక్షల ద్వారా తెలిసింది. 

మరిన్ని వార్తలు