స్థూలకాయులకు మాంసాహారం ముప్పే!

25 Aug, 2016 23:46 IST|Sakshi
స్థూలకాయులకు మాంసాహారం ముప్పే!

పరిపరి  శోధన


మధుమేహవ్యాధిగ్రస్థులు స్వీట్సు తినడం వల్ల ఎంత ప్రమాదం కొని తెచ్చుకున్నట్లవుతుందో, స్థూలకాయులు మాంసాహారాన్ని తీసుకోవడం వల్ల అదేవిధమైన హాని కలుగుతుందట. మాంసాహారం లేనిదే ముద్ద గొంతు దిగని వారికి ఈ విషయం మింగుడు పడదేమో మరి! ఎందుకంటే స్థూలకాయం ఉన్నవారికి మాంసాహారం తినడం వల్ల ముప్పు తప్పదంటున్నాయి కొత్త పరిశోధనలు. మన శరీరానికి కొవ్వులు, ప్రొటీన్లు అవసరమే. అయితే అవసరమైనదానికన్నా ఎక్కువ తీసుకుంటేనే చిక్కొచ్చిపడుతుంది.

ఎప్పుడో ఒకసారి తీసుకుంటే ఫరవాలేదు కానీ, తరచు మాంసాహారం తీసుకోవడం వల్ల ముప్పే. ముఖ్యంగా స్థూలకాయులకైతే మరింత ఇబ్బంది తప్పదని అంటున్నారు అడిలైడ్స్ విశ్వవిద్యాలయంలో ఫుడ్ అండ్ న్యూట్రిషన్ శాఖ పరిశోధకులు.

మరిన్ని వార్తలు