థైరాయిడ్ గ్రంథి

22 Oct, 2013 00:08 IST|Sakshi
థైరాయిడ్ గ్రంథి

మన శరీరంలోని అత్యంత కీలకమైన గ్రంథుల్లో ఒకటి థైరాయిడ్ గ్రంథి. థైరాయిడ్ హార్మోన్ అన్ని జీవ వ్యవస్థలపై పనిచేస్తుంది. బేసల్ మెటబాలిక్ రేట్ (బీఎమ్‌ఆర్), శ్వాసవ్యవస్థ, గుండె, నాడీ, జీర్ణవ్యవస్థ, సంతానోత్పత్తి వ్యవస్థ... ఇలా ఎన్నింటిపైనో థైరాయిడ్ ప్రభావం ఉంటుంది. హైపోథలామస్, పిట్యూటరీ, థైరాయిడ్ వ్యవస్థలలో మార్పులు రావడం వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరులో మార్పులు సంభవించి హైపర్ థైరాయిడిజమ్, హైపోథైరాయిడిజం వంటి సమస్యలు వస్తాయి.
 
 హైపోథైరాయిడిజమ్:
శరీరానికి కావాల్సిన దానికంటే తక్కువ మోతాదులో థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్‌ను ఉత్పత్తి చేయడం వల్ల ఇది ఇస్తుంది. ఏ వయసులో ఉన్నవారైనా హైపోథైరాయిడిజమ్‌కు గురికావచ్చు. పిల్లలు, స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.
 
 లక్షణాలు: పిల్లల్లో బుద్ధిమాంద్యం, ఎదుగుదలలో లోపం, జ్ఞాపకశక్తి లేకపోవడం, మలబద్దకం, చురుకుదనం లోపించడం, వయసుకు మించి లావుగా ఉండటం.
 
 యుక్తవయసువారిలో: బరువు పెరగడం, రుతుచక్రం ఆలస్యం కావడం, నెలసరిలో అధికరక్తస్రావం లేదా తక్కువ రక్తస్రావం, సంతానలేమి, చర్మం పొడిబారడం, వెంట్రుకలు రాలడం, బద్దకంగా ఉండి పనిచేయాలని అనిపించకపోవడం, చలిని తట్టుకోలేకపోవడం. ఆడవారిలో రోజూ వేసుకునే దుస్తులు, గాజులు బిగుతు కావడం, అల్వికేరియా అనే చర్మసంబంధిత వ్యాధులతో హైపోథైరాయిడిజమ్‌ను సులువుగా గుర్తించవచ్చు.
 
 హైపర్ థైరాయిడిజమ్: థైరాయిడ్ గ్రంథి ఎక్కువ మోతాదులో థైరాక్సిన్ విడుదల చేయడంవల్ల వస్తుంది.
 
 లక్షణాలు: ఆహారం సరైన మోతాదులో తీసుకున్నా బరువు తగ్గడం, నిద్రలేమి, గుండెదడ, అధికంగా చెమటలు, విరేచనాలు, చేతులు వణకడం, నీరసంగా ఉండటం, నెలసరి త్వరగా రావడం, రుతుచక్రమంలో అధిక రక్తస్రావం.
 
 హషిమోటోస్ థైరాయిడైటిస్ :
ఇది జీవన క్రియల అసమతుల్యతల వల్ల వచ్చే సమస్య. దీనిలో థైరాయిడ్ గ్రంథికి వ్యతిరేకంగా యాంటీబాడీస్ ఉత్పన్నమై, థైరాయిడ్ గ్రంథిని సక్రమంగా పనిచేయనివ్వవు. ఇందులో హైపో, హైపర్ థైరాయిడ్ లక్షణాలు ఉండే అవకాశం ఉంది.
 
 గాయిటర్: థైరాయిడ్ గ్రంథి వాపునకు గురి కావడాన్ని గాయిటర్ అంటారు. కొన్ని సందర్భాల్లో దీని వాస్తవ పరిమాణం కంటే రెండింతల వాపు రావచ్చు.
 

కారణాలు: అయోడిన్ అనే మూలకం లోపించడం. గ్రేవ్స్ డిసీజ్, పిట్యూటరీ గ్రంథి ట్యూమర్స్, థైరాయిడ్ క్యాన్సర్ కూడా దీనికి కారణాలు.
 
 లక్షణాలు:  

 గొంతు కింద వాపు వచ్చి మింగడానికి కష్టంగా ఉంటుంది.
 
 స్వరంలో మార్పులు.  
 
 ఎక్సా ఆఫ్తాల్మిక్ గాయిటర్ అంటే... కనుగుడ్లు బయటకు పొడుచుకు వచ్చినట్లుగా ఉండటం.
 
 చికిత్స : థైరాయిడ్ సమస్యలకు మందులు లేవనీ, జీవితాంతం థైరాక్సిన్ వాడటం తప్ప మరో మార్గం లేదని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. అయితే రోగి శరీర తత్వాన్ని బట్టి హోమియో చికిత్స విధానం ద్వారా వైద్యం అందిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
 
 డాక్టర్ ఎం. శ్రీకాంత్, సి.ఎం.డి.,
 హోమియోకేర్ ఇంటర్నేషనల్

 

మరిన్ని వార్తలు