లోబిపి ఉంటే...

29 Jul, 2019 10:26 IST|Sakshi

హైపోటెన్షన్‌ రక్తప్రసరణ వేగాన్ని తగ్గిస్తుంది. దీనినే లో బిపి అంటాం. ఆహార మార్పుతో దీనిని చక్కదిద్దవచ్చని పరిశోధకులు అంటున్నారు.
వారం రోజుల పాటు ఉదయం ఒకకప్పు, సాయంత్రం ఒక కప్పు పచ్చిబీట్‌రూట్‌ రసం తాగితే తేడా స్పష్టంగా తెలుస్తుంది. దానిమ్మ రసం కూడా రక్తప్రసరణను క్రమబద్ధీకరించడంలో బాగా పని చేస్తుంది.
వారం రోజుల పాటు తాజాపండ్లను మాత్రమే ఆహారంగా తీసుకుంటే బిపి క్రమబద్ధం కావడంతోపాటు వ్యవస్థ మొత్తం శక్తిమంతం అవుతుంది. రోజుకు మూడుసార్లూ తాజా పండ్లనే తీసుకోవాలి. ఐదు గంటల వ్యవధిలో పూర్తిస్థాయి భోజనానికి సరిపడిన మోతాదులో పండ్లను తినాలి. తర్వాత రెండు లేదా మూడు వారాలపాటు పండ్లతోపాటు పాలు తీసుకోవాలి. ఆ తర్వాత పండ్లను మరికొంత తగ్గించి గింజలు, చిరుధాన్యాలు, పచ్చికూరగాయలను కూడా చేర్చాలి. ఇలా చేయడం వల్ల సమస్య పూర్తిగా అదుపులోకి వస్తుంది. ఇలా మూడునెలలకొక కోర్సు ఫుడ్‌హ్యాబిట్‌ పాటిస్తుంటే మంచిది.

మరిన్ని వార్తలు