బట్టలు సువాసన రావాలంటే..

27 Aug, 2016 00:54 IST|Sakshi
బట్టలు సువాసన రావాలంటే..

ఇంటిప్స్

ఆమ్లెట్ బాగా పొంగాలంటే... కోడిగుడ్డు సొనలో చిటికెడు పంచదార కానీ, కాసింత మొక్కజొన్న పిండి కానీ కలపాలి.ఇస్త్రీ చేసేటప్పుడు ఇస్త్రీపెట్టెలో వేసే నీళ్లలో కాసింత పర్‌ఫ్యూమ్ వేస్తే బట్టలు మంచి సువాన వస్తాయి.  కోడిగుడ్లు ఉడికించే గిన్నె నల్లబడిపోతూ ఉంటుంది. అలా అవ్వకుండా ఉండాలంటే... ఉడికించేటప్పుడు నీటిలో కొద్దిగా చింతపండు వేయాలి.


అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువకాలం నిల్వ ఉండాలంటే దానిలో కొద్దిగా పసుపు కలిపి డబ్బాలో దాచిపెట్టాలి. మాంసం కాస్త ముదురుగా అనిపిస్తే... ఉడికించేటప్పుడు చిన్న బొప్పాయి ముక్క వేస్తే త్వరగా ఉడుకుతుంది. బియ్యం కడిగిన నీళ్లలో కాకరకాయ ముక్కలను కాసేపు నానబెట్టి తీసి, ఆ తర్వాత వండితే చేదు ఉండదు.

 

మరిన్ని వార్తలు