ఈ పాటకు ట్యూన్ తెలుసా?

16 Feb, 2014 23:36 IST|Sakshi
ఈ పాటకు ట్యూన్ తెలుసా?

 పల్లవి :
 
 అతడు: పందిరివేసిన ఆకాశానికి
   ఇవ్వమ్మా ఆహ్వానం
 పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం
 నువ్వు రామ్మా ఓ వేదమా...
 విడాకుల పత్రిక అందుకుని
   వెంటనే వేరుచేయుమా
 దంపతుల విడదీసే మంత్రం
   కొత్తగా నేర్చుకోవమ్మా
 ॥
 
 చరణం : 1
 
 అ: ప్రతిమనువూ స్వర్గంలో మునుముందే
   ముడిబడుతుందా
 ఆ మాటే నిజమైతే ఈ చట్టం విడగొడుతుందా
 ఆమె: నీ రాతకు ఎంత సత్యం ఉందో
   చూద్దువు బ్రహ్మయ్యా
 నీ సాక్ష్యం ఎంత విలువైందో ఓ అగ్ని చూడయ్యా
 నువ్వు రామ్మా ఓ అరుంధతి...
 ఇదే నీ దర్శన ఫలమైతే ఎటైనా దాగిపోవమ్మా
 నిజంగా పెళ్లికి బలముంటే
   సూటిగా ఇటు దిగిరావమ్మా
 ॥
 
 చరణం : 2
 
 అ: చితిమంటల సహగమనం
   ఒకసారే బలిచేస్తుంది
 పతి విడిచిన సతిగమనం
   ప్రతి నిమిషం రగిలిస్తుంది
 ఆ: ఆ జ్వాలలతోనే జీవించే టి ధైర్యం అందిస్తూ
 ఓ బంధువులారా దీవించండి దీర్ఘసహనమస్తు
 నువ్వు రామ్మా మాంగల్యమా...
 వివాహపు వేదికలో నిన్ను ముడేసిన
   నిన్నటి వేళ్లకు
 విడాకుల వేడుకలో నేడు తె ంపడం నేర్పడానికి
 ॥
 
 చిత్రం: ఆహ్వానం (1997)
 రచన: సిరివెన్నెల, సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి
 గానం: ఎస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర

 

మరిన్ని వార్తలు