అత్యంత ఖరీదైన ఈ బర్గర్ రుచిచూడాలంటే..

20 Jun, 2019 15:34 IST|Sakshi

టోక్యో : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బర్గర్లలో ఒకటిగా నిలిచిన గోల్డెన్‌ జెయింట్‌ బర్గర్‌ ఆహార ప్రియులను అలరిస్తోంది. టోక్యోలోని గ్రాండ్‌ హ్యాత్‌ రెస్టారెంట్‌లోని ఓక్‌ డోర్‌ స్టీక్‌ హౌస్‌లో అందుబాటులో ఉన్న ఈ బర్గర్‌ను రుచిచూడాలంటే భారత కరెన్సీలో రూ 70,000లు వెచ్చించాల్సిందే. ఇంత ఖరీదైన ఈ బర్గర్‌లో ఏమేం ఉంటాయనే ఆసక్తి కలగడం సహజమే.

మూడు కిలోల బరువుండే ఈ బర్గర్‌ 15 సెంటీమీటర్ల ఎత్తు ఉంటుంది. ఈ బర్గర్‌లో కిలో బీఫ్‌తో పాటు టొమాటోలు, చీజ్‌, బాతు మాంసం ఇంకా అల్లం, శాఫ్రాన్‌ సాస్‌ ఉపయోగిస్తారు. బన్‌పైన షాంపేన్‌, రెడ్‌, వైట్‌ వైన్‌లను స్ప్రే చేసి కస్టమర్లకు సర్వ్‌ చేస్తారు. ఈ గోల్డెన్‌ జెయింట్‌ బర్గర్‌ను చెఫ్‌ పాట్రిక్‌ షిమడ ఐడియాగా చెబుతున్నారు. ఈ బర్గర్‌ తయారీలో ఎనిమిది మంది సిబ్బంది పాలుపంచుకుంటారని చెఫ్‌ చెప్పుకొచ్చారు. ఇక ఈ బర్గర్‌ను రుచి చూడాలనుకునేవారు కనీసం మూడు రోజులు ముందు రిజర్వ్‌ చేసుకోవాలి.

మరిన్ని వార్తలు