మెడపై మచ్చలు తొలగాలంటే...

3 Aug, 2016 22:57 IST|Sakshi
మెడపై మచ్చలు తొలగాలంటే...

 బ్యూటిప్స్

 బ్యూటిప్స్అందమైన మెడ... ముఖారవిందాన్ని మరింత అందంగా కనిపించేలా చేస్తుంది. చెమట, మురికి కారణంగా మెడ భాగమంతా నల్లగా, డల్‌గా అవుతుంది. ఈ సమస్య తీరాలంటే... అరటిపండుని గుజ్జులా చేసి... అందులో కాసిన్ని పాలు, రెండు చుక్కల నిమ్మరసం వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని మెడ భాగానికి ప్యాక్‌లా వేసి, ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. వారానికోసారి చొప్పున ఇలా కొన్ని వారాలు చేస్తే మంచి ఫలితముంటుంది. రోజూ స్నానం చేసేముందు మెడకి పెట్రోలియం జెల్లీ పట్టించాలి. కాసేపు అలా ఉంచి, తర్వాత మెత్తని పొడి బట్టతో రుద్ది తుడవాలి. ఇలా చేయడం వల్ల పేరుకున్న మురికి పోతుంది.
 

తెల్లద్రాక్షలను మెత్తగా రుబ్బి గుజ్జులా చేయాలి. ఈ మిశ్రమంతో మెడను బాగా రుద్ది వదిలేయాలి. ఆరిన తర్వాత చల్లని నీటితో కడగాలి. వారానికి రెండు మూడుసార్లు ఇలా చేస్తే మెడమీది చర్మం ఆరోగ్యంగా తయారై కాంతులీనుతుంది. మజ్జిగలో దూదిని ముంచి మెడ భాగాన్ని తరచూ శుభ్రం చేసుకుంటూ ఉంటే... మురికి, నలుపు పోయి అందంగా తయారవుతుంది.

మరిన్ని వార్తలు