తీవ్రమైన వెన్ను నొప్పి... తగ్గేదెలా?

23 Jan, 2020 02:24 IST|Sakshi

నా వయసు 39 ఏళ్లు. విపరీతమైన వెన్నునొప్పి వస్తోంది. నా సమస్యకు హోమియోలో చికిత్స ఉందా?

ఇటీవల వెన్నునొప్పి చాలా ఎక్కువ మందిలో కనిపిస్తున్న సాధారణమైన సమస్య. ఎక్కువగా బరువు ఎత్తడం, దించడం, ఊబకాయం, ఇన్ఫెక్షన్లు, క్యాల్షియమ్‌ లోపం, విటమిన్‌ బి12, డీ3 లోపాలు, ఎముకల సాంద్రత తగ్గడం వంటివి వెన్నునొప్పికి కొన్ని కారణాలు.  డిస్క్‌ బల్జ్, డిస్క్‌ కంప్రెషన్, నరాలమీద ఒత్తిడి పెరగడం వల్ల తీవ్రమైన నొప్పి వస్తుంటుంది. హోమియోలో ఇలాంటి వెన్ను సంబంధమైన నొప్పులు వచ్చినప్పుడు... ఉదాహరణకు డిస్క్‌ బల్జ్‌ వల్ల నరాలమీద ఒత్తిడి పెరిగినప్పుడు తగ్గించడానికి కోబాల్ట్‌ లాంటి ప్రభావపూర్వకమైన మందులు అందుబాటులో ఉన్నాయి.

ఇక మెడభాగంలో ఉండే వెన్నుపూసలు అరిగినప్పుడు వచ్చే నొప్పిని సర్వైకల్‌ స్పాండిలోసిస్‌ అంటారు. మెడ భాగంలో సి1 నుంచి సి7 వరకు ఉండే వెన్ను పూసలను సర్వైకల్‌ పూసలు అంటారు. ఇవి అరిగినప్పుడు వెన్నుపూసల కీళ్ల మధ్య భాగం తగ్గిపోవడం వల్ల డిస్క్‌బల్జ్‌ ఏర్పడటం, వెన్నుపూసల మధ్య రాపిడి పెరగడం వంటి కారణాల వల్ల మెడ భాగం నుంచి నొప్పి మొదలై చేతి వేళ్ల వరకు నొప్పి పాకుతూ ఉంటుంది. దాంతో పాటు తిమిర్లు, చేయి మొద్దుబారడం, మెడ ఫ్రీగా తిరగలేకపోవడం, మెడ పట్టివేసినట్లుగా ఉండటం వంటివి చూస్తుంటాం.

చికిత్స: మెడ ఫ్రీగా తిరగకుండా పట్టేసినట్లుగా ఉన్నవారికి యాసిడ్‌ఫాస్‌ అనే మందు బాగా పనిచేస్తుంది. ఇక మెడ, నడుము, వెన్నెముక నొప్పులకు ఆస్క్యులస్‌ హిప్, రస్టాక్స్, బ్రయోనియా ఆల్బ్, కాల్కేరియా ఫ్లోర్, హైపరికం, మహిళల్లో వచ్చే ఇలాంటి సమస్యలకే సిమిసిఫ్యూగా వంటివి అద్భుతంగా పనిచేస్తాయి.
డాక్టర్‌ కె. శ్రీనివాస్‌ గుప్తా, ఎండీ (హోమియో),
స్టార్‌ హోమియోపతి, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు