విష వాయువులను ఇంధనంగా మార్చారు!

20 Nov, 2017 00:39 IST|Sakshi

కార్బన్‌ డైయాక్సైడ్, మీథేన్‌! భూతాపోన్నతి పెరిగిపోయేందుకు, తద్వారా వాతావరణ మార్పులతో భూమ్మీద మనుగడ కష్టమయ్యేందుకూ కారణమైన రెండు విషవాయువులు. వాతావరణంలోకి చేరుతున్న వీటి మోతాదును ఎలా తగ్గించాలని ఒకవైపు ప్రయత్నాలు సాగిస్తూంటే.. ఇంకోవైపు సర్రే విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ విష వాయువులను ఎంచక్కా మన వంటగ్యాస్‌ మాదిరిగా మార్చేసేందుకు ఓ వినూత్న ఉత్ప్రేరకాన్ని సిద్ధం చేశారు.

వాతావరణంలోకి చేరుతున్న కార్బన్‌ డైయాక్సైడ్, మీథేన్‌ల మోతాదు గత నాలుగేళ్లుగా స్తబ్దుగా ఉంటే... ఈ ఏడాది మళ్లీ హెచ్చడం మొదలైందని శాస్త్రవేత్తలు అంటున్నారు. వీటిని ఒడిసిపట్టి వేర్వేరు పద్ధతుల్లో నిల్వ చేసేందుకు కొన్ని టెక్నాలజీలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవి వ్యయ ప్రయాసలతో కూడుకున్నవి. ఈ నేపథ్యంలో సర్రే శాస్త్రవేత్తలు నికెల్‌ ఆధారిత ఉత్ప్రేరకం సాయంతో ఈ వాయువులను కత్రిమ వంటగ్యాస్‌గా మరికొన్ని ఇతర ప్రయోజనకరమైన పదార్థాలుగా మార్చవచ్చునని నిరూపించారు.

పైగా ఈ ఉత్ప్రేరకాన్ని వాడటం కూడా సులువు అని, చౌకగానూ ఉపయోగించుకోవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్‌ థామస్‌ ఆర్‌. రీనా తెలిపారు. వాతావరణంలోంచి ఈ విషవాయువులను తొలగించడం వాటిని ఉపయోగకరమైన పదార్థాలుగా మార్చుకోవడం రెండూ చౌకగా జరిగిపోతే భూతాపోన్నతి సమస్యను సులువుగా పరిష్కరించవచ్చునన్నది తెలిసిందే.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా