ఆషాఢ లక్ష్ములు...

25 Jun, 2014 22:37 IST|Sakshi

ముస్తాబు
 
 ఆషాఢంలో గోరింట పూసిన చేతులతో ఆదిలక్ష్ములు...
 శ్రావణంలో సిరులు కురిపించే శ్రీ మహాలక్ష్ములు...
 మాసమేదైనా... వేడుకేదైనా...
 అమ్మాయిల ఛాయిస్ లంగా, ఓణీ అయితే
 ఐశ్వర్యం ఆ ఇంట కొలువుదీరుతుంది.
 అమ్మానాన్నలకు కనులపండుగవుతుంది.
 నేటి తరం అమ్మాయిలు ముస్తాబుకు ఇష్టపడి ఎంచుకునే ముచ్చటైన లంగా, ఓణీల కాంబినేషన్ మీ కోసం...

 
1- నీలాకాశం రంగు నెట్ లెహంగాకు ఎరుపురంగు బెనారస్ చున్నీని జత చేరిస్తే ఏ పండగైనా నట్టింటికి నడిచొచ్చేస్తుంది. మిర్రర్ వర్క్ ఉన్న లెహంగా బార్డర్, బెనారస్ బ్లౌజ్ అదనపు ప్రత్యేకతలు.
 
 2- హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసిన సియాన్ గ్రీన్ రా సిల్క్ లెహంగాను మరింత ఆకర్షణీయంగా మార్చివేసింది బెనారస్ చున్నీ. కుందన్ వర్క్ చేసిన ఆఫ్‌వైట్ రా సిల్క్ బ్లౌజ్ ప్రత్యేకంగా కనిపిస్తోంది.
 
 3-
కనకాంబరం రంగు లెహెంగాకు రాయల్ బ్లూ చున్నీ జతకడితే పండిన గోరింటాకు ఎర్రదనం చెక్కిళ్లలో పూస్తుంది. సీక్వెన్స్ చమ్కీ వర్క్ బార్డర్ జత చేసిన లెహంగా స్టోన్ వర్క్‌తో మెరిసిపోతుంటే, కుందన్‌వర్క్ బ్లౌజ్ ప్రత్యేక శోభను తీసుకువస్తుంది.
 
 4- మిర్రర్ వర్క్ చేసిన షిమా జార్జెట్ మెటీరియల్‌ను లెహంగాగా మార్చి,  అద్దాలతో కట్ వర్క్ చున్నీని మెరిపిస్తే పట్టపగలే తారలు దిగివచ్చినట్టుగా అనిపించకమానదు.
 
 5- పీచ్ కలర్ నెట్ లెహంగా, మింట్ గ్రీన్ చున్నీ, ఫుల్ స్లీవ్స్ నెట్ బ్లౌజ్.. పైనంతా స్వీక్వెన్స్ వర్క్‌తో రూపుకడితే రాత్రి దీపకాంతిలో దేదీప్యమానంగా వెలిగిపోవచ్చు.
 
 డిజైనర్ టిప్స్:

 కుందన్స్, స్టోన్స్, చమ్కీ, మిర్రర్‌లతో చేసిన వర్క్‌లు పాడైపోకుండా ఉండాలంటే లెహంగాలను దగ్గరికి మడతపెట్టకూడదు.
     
 ఎంబ్రాయిడరీ గల లెహంగాలేవైనా హ్యాంగర్‌కి వేలాడదీయాలి.  
     
 ఏ లెహంగా అయినా శుభ్రపరచాలంటే మైల్డ్ షాంపూతో లేదంటే డ్రై వాష్ చేయించడం ఉత్తమం.
     
 మిర్రర్ వర్క్, స్వీక్వెన్స్ వర్క్ గల లెహెంగాలు రాత్రి వేడుకలకు బ్రైట్‌గా కనిపిస్తాయి.
     
 సంప్రదాయ వేడుకలకు కేశాలంకరణగా జడ, కాంబినేషన్ ఆభరణాలు బాగా నప్పుతాయి.
     
 బర్త్‌డే, రిసెప్షన్ వంటి ఈవెనింగ్ వేడుకలకు కట్ వర్క్ చున్నీలు, స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లు, వదులుగా ఉండే కేశాలంకరణ బాగా నప్పుతాయి.
 
 కర్టెసీ: శశి, ఫ్యాషన్ డిజైనర్, ముగ్ధ ఆర్ట్ స్టూడియో, హైదరాబాద్
 www.mugdha410@gmail.com

 

మరిన్ని వార్తలు