8న బసంపల్లిలో గో ఆధారిత వ్యవసాయంపై శిక్షణ

2 Apr, 2019 06:25 IST|Sakshi

అనంతపురం జిల్లా చెన్నే కొత్తపల్లి మండలం బసంపల్లి గ్రామంలోని ఆలయ ప్రాంగణంలో ఏప్రిల్‌ 8న ఉ. 9 గం. నుంచి సా. 4 గం. వరకు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ పద్ధతిపై సీనియర్‌ రైతు నాగరాజు శిక్షణ ఇస్తారు. పాల్గొనదలచిన రైతులు ముందుగా తమ పేర్లు నమోదు చేయించుకోవాలి. రుసుము రూ. 100
(భోజనం సహా). వివరాలకు.. 94407 46074, 96636 67934.

6న చిరుధాన్యాల సాగు...
మిక్సీతో బియ్యం తయారీపై శిక్షణ
ప్రకృతి వ్యవసాయ విధానంలో చిరుధాన్య పంటల సాగు – మిక్సీతో చిరుధాన్యాల బియ్యం తయారీపై ఈ నెల 6 (శనివారం)న రైతునేస్తం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడులో రైతులకు కడప జిల్లా రైతు శాస్త్రవేత్త విజయ్‌కుమార్‌ శిక్షణ ఇవ్వనున్నారు. సిరిధాన్యాల సాగులో వాడే విత్తనాల ఎంపిక, కషాయాలు, ద్రావణాలను తయారు చేసుకునే పద్ధతిని, సిరిధాన్యాల ధాన్యాన్ని మిక్సీలతో మహిళలే శుద్ధి చేసే విధానాన్ని విజయకుమార్‌ వివరిస్తారని రైతునేస్తం ఫౌండేషన్‌ చైర్మన్‌ డా. వెంకటేశ్వరరావు తెలిపారు. రిజిస్ట్రేషన్‌ తదితర వివరాలకు...
97053 83666, 0863– 228655. 

మరిన్ని వార్తలు