పిల్లలతో ప్రయాణం

12 Apr, 2018 00:05 IST|Sakshi

టూర్‌ 

వేసవి సెలవుల్లో కుటుంబం అంతా కలిసి టూర్లకు, పిక్నిక్‌లకు వెళ్లడం వైపు దృష్టి ఎక్కువ ఉంటుంది. విహారానికి పిల్లలను వెంట తీసుకెళుతున్నప్పుడు ముందే సరైన ప్లాన్‌ చేసుకుంటే ప్రయాణంలో  ఇబ్బంది ఉండదు. పిల్లలూ ఆనందాన్ని మిస్‌ అవకుండా ఉంటారు.టూర్‌ ప్లాన్‌ చేసుకున్నప్పుడే వెళ్లే చోట పిల్లలు ఎంజాయ్‌ చేసే ప్రదేశాలు ఉన్నాయా లేవా చెక్‌ చేసుకోవాలి. ఉండే చోట ప్లే జోన్స్, ఫుడ్‌ జోన్స్‌ దగ్గరగా ఉండేలా చూసుకోవాలి.చారిత్రక ప్రదేశాలు, థీమ్‌ పార్క్, గుర్తింపు పొందిన ప్రదేశాలను సందర్శించేటప్పుడు ముందే వాటి గురించి ప్రా«థమిక సమాచారం ఇచ్చి, మరింత తెలుసుకునేంత సహనంగా ఉండాలని సిద్ధం చేయాలి. 

ఆకలి అనిపిస్తే చాలు పిల్లలు విపరీతంగా విసిగించేస్తారు. టూర్‌ సంపూర్ణంగా ఎంజాయ్‌చేయాలంటే పిల్లల నోళ్లకు పనిచెప్పే స్నాక్స్‌ కావల్సినన్ని వెంట తీసుకెళ్లాలి. వీటిలో పంచదార, ఫుడ్‌ కలర్‌ ఉన్నవైతే తగ్గించడం మంచిది. ఛీజ్, చిరుధాన్యాలతో చేసిన స్నాక్స్‌.. వంటివి అయితే బెటర్‌. కారులో వెళుతున్నట్లైతే పిల్లల చేతులకు, మెదళ్లకు పనిచెప్పే గేమ్స్‌ ఉంటే మరీ మంచిది. పజిల్‌ బుక్స్, వీడియోగేమ్స్‌.. లాంటివి. చుట్టూ ఉన్న ప్రదేశాలను కెమెరా కన్నుతో చూడటానికి పిల్లలు మరింత ఆసక్తి చూపుతారు. అయితే, మరీ ఖరీదైన లెన్స్‌ కెమెరాల వంటివి కాకుండా ఎక్కువ ఫొటోలు తీసే డిజిటల్‌ లైట్‌ వెయిట్‌ కిడ్స్‌ కెమెరాను ఎంపిక చేసుకోవడం ఉత్తమం.
– ఎన్‌.ఆర్‌.

మరిన్ని వార్తలు