శస్త్రచికిత్స లేకుండానే గుండెపోటుకు చికిత్స!

13 Aug, 2018 00:55 IST|Sakshi

రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడి గుండెపోటు వస్తే శస్త్ర చికిత్స మినహా మరో మార్గం లేదు. ఇదీ ఇప్పటివరకూ ఉన్న పరిస్థితి. నార్త్‌ కారొలీనా స్టేట్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తల పరిశోధనల పుణ్యమా అని ఇకపై శాస్త్రచికిత్సకు గుడ్‌బై చెప్పేయవచ్చు. ఎలాగంటారా? చాలా సింపుల్‌. రక్తనాళాల్లోని అడ్డంకులను ఇట్టే కరిగించేందుకు వీరు ఓ వినూత్నమైన పద్ధతిని అభివృద్ధి చేశారు. దాదాపు 250 నానోమీటర్లు (ఒక నానోమీటర్‌ అంటే.. వెంట్రుక మందంలో  లక్షవ వంతు) సైజుండే గుళికల్లో పొరలు పొరలుగా మందులు జొప్పించడం.. ఇంజెక్షన్ల ద్వారా ఈ గుళికలను రక్తనాళాల్లోకి ప్రవేశపెట్టడం ఈ పద్ధతిలోని ముఖ్యాంశాలు.

గుళిక మధ్యభాగంలో వై–27632 అనే మందు/ప్రొటీన్‌ ఉంటుంది. దీనిచుట్టూ టిష్యూ ప్లాస్మినోజిన్‌ ఆక్టివేటర్‌ అనే ఇంకో మందును ఒక పొరలా ఏర్పాటు చేస్తారు. గుళిక బయటివైపు రక్తనాళాల్లో అడ్డంకులకు ప్రధాన కారణమైన ఫైబ్రిన్‌కు అతుక్కుపోగల ప్రొటీన్‌ పూత ఉంటుంది. రక్తనాళాల వెంబడి సులువుగా ప్రవహించే ఈ గుళికలు అడ్డంకులు ఉన్న చోట మాత్రం ఫైబ్రిన్‌కు అతుక్కుపోతాయి. ఆ వెంటనే లోపల ఉండే ప్లాస్మినోజిన్‌ ఆక్టివేటర్‌ బయటపడి ఫైబ్రిన్‌ను కరిగిస్తుంది. ఆ తరువాత లోపని మందు ఆ ప్రాంతంలోని కణజాలానికి బ్యాండేజీలా ఉపయోగపడుతుంది.

ఈ నానోగుళికలు కొన్ని నిమిషాల వ్యవధిలోనే రక్తనాళాల్లోని అడ్డంకులను కరిగించగలవని ఇప్పటికే రుజువైంది. అంతేకాకుండా గుండెపోటు కారణంగా జరిగే గుండె కండర నష్టాన్ని గణనీయంగా తగ్గించడంతోపాటు గుండె పనితీరును కూడా సంరక్షించిందని ఎలుకలపై జరిగిన పరిశోధనలు చెబుతున్నాయి. ఏసీఎస్‌ నానో జర్నల్‌ తాజా సంచికలో ఈ పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి.


సా...గిపోయే కారు ఇది!
అవసరానికి తగ్గట్టుగా ఎక్కువమందిని మోసుకెళ్లేలా మన కారు సాగిపోతే ఎలా ఉంటుంది? భలే ఉంటుందన్న ఆలోచనల ఆధారంగా తయారైన కారే ‘ఐఈవీ ఎక్స్‌ +’  ఒక్కరు మాత్రమే ప్రయాణించేటప్పుడు ఈ విద్యుత్తు వాహనం కేవలం మూడు అడుగుల వెడల్పు, ఐదు అడుగుల పొడవు ఉంటుంది. ఇంకొకరు కూడా అదే కారులో వెళ్లాలని అనుకుంటే మాత్రం ఒక్క మీట నొక్కితే చాలు.. కారు పొడవు ఆరు అడుగుల మూడు అంగుళాల వరకూ సాగుతుంది. అబ్బే.. చేతిలో ఉండే లగేజీని ఏం చేయాలి? అనుకుంటూ ఉంటే.. ఇంకో మీట నొక్కేసి కారు పొడవును ఇంకో అడుగు వరకూ పెంచేసుకోవచ్చు.

ఐడియా భలే ఉంది కదూ! కారు వివరాలు అంతే బాగున్నాయి. మూడు మోడళ్లు ఉన్నాయి ఈ కారుకు ఒకటేమో 115 కిలోల బరువు ఉంటుంది. 48 వోల్టుల లిథియం అయాన్‌ బ్యాటరీ ప్యాక్‌ సాయంతో గంటకు 45 కిలోమీటర్ల వేగంతో 60 కిలోమీటర్ల దూరం వరకూ వెళ్లగలదు. పార్కింగ్‌ చేసినప్పుడు బ్యాటరీలను ఛార్జ్‌ చేసేందుకు 40 వాట్ల సోలార్‌ ప్యానెళ్లను పైకప్పుపై ఏర్పాటు చేశారు. రెండో మోడల్‌ బరువు 145 కిలోలు కాగా.. బ్యాటరీ 72 వోల్టులది. సోలార్‌ ప్యానెల్స్‌ కూడా 60 వాట్ల వరకూ ఉంటాయి. ఒకసారి ఛార్జ్‌ చేసుకుంటే 120 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. బేసిక్‌ మోడల్‌ ఖరీదు రూ.1.5 లక్షలు కాగా.. రెండో మోడల్‌ మాత్రం రూ.6.5 లక్షల వరకూ ఉంటుంది.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఏడాది గడచినా ఏ సాయమూ లేదు

తెల్లదోమను తట్టుకున్న కొబ్బరి తోట

సేంద్రియ సేద్యంపై నెల రోజుల ఉచిత సర్టిఫికెట్‌ కోర్సు

చేనుకి పోయిన మనిషి చితికిపోతే ఎలా?

తాటి చెట్టుకు పది వేలు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సైలెంట్‌గా ఉన్నారు

నెక్ట్స్‌ ఏంటి?

వాళ్ల మైండ్‌సెట్‌ మారుతుందనుకుంటున్నా

ప్రేమ సందేశాలు

అందుకే వద్దనుకున్నా!

హత్య చేసిందెవరు?