చర్మానికి ట్రీట్‌మెంట్

26 Jul, 2016 00:41 IST|Sakshi
చర్మానికి ట్రీట్‌మెంట్

 బ్యూటిప్స్

పుచ్చకాయ సహజమైన ఆస్ట్రింజెంట్. చర్మం మీద పేరుకుపోయిన కాలుష్యపు జిడ్డును తొలగిస్తుంది. మచ్చలు, గాయాల గీతలను పోగొడుతుంది. వార్ధక్యంతో వచ్చే ముడతలను నివారిస్తుంది. ఒక్కమాటలో... చర్మానికి ఇది... ట్రీట్ (విందు) మెంట్.అర కప్పు పుచ్చకాయ ముక్కలను మిక్సీలో బ్లెండ్ చేసి రసం తీసుకుని ఆ రసాన్ని దూదితో ఒంటికి పట్టించాలి. ఎండ ఉన్నప్పుడు ప్రతిరోజూ ఈ ప్యాక్ వేయవచ్చు. పదిహేను నిమిషాల తర్వాత చన్నీటితో స్నానం చేయాలి.

వాటర్‌మెలన్ ఎక్స్‌ఫోలియేషన్‌కు కూడా బాగా పని చేస్తుంది. పుచ్చకాయలోని తెల్లటి భాగాన్ని చిక్కగా పేస్టు చేసి ఒంటికి పట్టించి వలయాకారంగా మర్దన చేయాలి. ఇది మృతకణాలను తొలగించడంతోపాటు నాచురల్ క్లెన్సర్‌గానూ పని చేస్తుంది. చర్మం పటుత్వాన్ని పెంచుతుంది.
 

మరిన్ని వార్తలు