గీత స్మరణం

6 Sep, 2013 04:34 IST|Sakshi
గీత స్మరణం

 పల్లవి :
 
 సన్నజాజి తీవలోయ్...
 సంపంగి పూవులోయ్...
 చిలిపి సింగారులోయ్...
 పాపలు సిరులొలికే చిన్నారులోయ్...
 ॥
 
 చరణం : 1
 
 కన్నుల విందులోయ్
 వెన్నెల చిందులోయ్
 పచ్చని బ్రతుకులో పన్నీటి జల్లులోయ్
 బాలల సందడే పరువూ వేడుకా
 ఇలు వాసికి మరో పేరు ఈ చిన్నారులే
 ॥
 
 చరణం : 2
 
 లోగిలి బలిమే బాలల నవ్వులూ
 ఇల్లాలి కలిమే పిల్లల కిలకిలా
 ఊరికి పండుగే ఇంటను ఊయలా
 సిరిసంపద మరో పేరు ఈ చిన్నారులే
 ॥
 
 చరణం : 3
 
 దాగుడుమూతలాడితే సూరీడు మెచ్చేను
 చెమ్మచెక్కలాడితే చందమామ మెచ్చేను
 చెమ్మ చెక్క చారెడేసి మొగ్గ
 ఇల్లుదీసి పందిరేసి పకపకలాడితే
 పిల్లలున్న లోగిలిని దేవుడే మెచ్చేను
 ॥
 
 చిత్రం : అనురాగం (1963)
 రచన : మల్లాది రామకృష్ణశాస్త్రి
 సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు
 గానం : భానుమతి

 
 సాక్షి ఫ్యామిలీకి సంబంధించి మీ సలహాలను, సూచనలను పంపండి.  ఫోన్: టోల్ ఫ్రీ నంబర్: 1800 425 9899 (ఉ.7.00-రా.8.00వరకు), పోస్ట్: సాక్షి ఫ్యామిలీ, 6-3-249/1, సాక్షి టవర్స్, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్-500034, మెయిల్: sakshi.features@gmail.com
 

మరిన్ని వార్తలు