ప్యాంట్ కొలత కరెక్టేనా?!

24 Apr, 2014 00:10 IST|Sakshi
ప్యాంట్ కొలత కరెక్టేనా?!

షాప్‌లో లేదా ఆన్‌లైన్ ద్వారా ప్యాంట్స్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఎప్పుడూ కొలతల విషయంలో ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది. షాప్‌లోనే వేసుకొని ఎంపికచేసుకోవడం అన్నిసందర్భాలలో కుదరదు. మీ నడుము కొలతకు వదులుగానో, మరీ బిగుతుగా ఉండే ప్యాంట్స్‌ను ఎంచుకోవడం, ఇంటికి వచ్చాక చెక్ చేసుకొని సరైన ఫిటింగ్ లేకపోతే మళ్లీ షాప్‌కి వెళ్లడం సహజంగా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి ఇబ్బంది లేకుండా...
 
ముందు టేప్‌తో మీ నడుము కొలత సరిచూసుకోండి. కొలత తీసుకునేటప్పుడు మరీ బిగుతుగా కాకుండా ‘ఫింగర్ విడ్త్’ ఉండేలా చూసుకోండి. షాప్‌కి వెళ్లినప్పుడు ఎంచుకున్న ప్యాంట్ కొలతతో సరిచూసుకోండి.
 
ఉదా: మీ నడుము సైజ్ 24 అంగుళాలు అయితే మీ ప్యాంట్ సైజ్ 0 అని గుర్తించండి. అదే 25 అంగుళాలు అయితే సైజ్ ‘2’, 26 అంగుళాలు అయితే సైజ్ ‘4’, 27 అంగుళాలు అయితే సైజ్ ‘6’ ఎంచుకోండి.
 
మీరు కొనుగోలు చేయబోయే ప్యాంట్‌ను ధరించిన ప్యాంట్ పైనే వేసుకొని షాప్ ట్రైలర్ రూమ్‌లో చూసుకుంటే కొలతలలో తేడా వస్తుంది.
 
బ్రాండెడ్ ప్యాంట్ కంపెనీలు ఆన్‌లైన్‌లో ‘ఉమెన్స్ సైజ్ చార్ట్’లు ప్రత్యేకంగా రూపొందించినవి ఉన్నాయి. వీటిని బట్టి మీ కొలతలకు తగ్గ ప్యాంట్ సైజ్‌లను ఎంచుకోవచ్చు.
 

మరిన్ని వార్తలు