షూటింగ్‌లో అలా చూస్తే ఫీలవుతాను

24 Jul, 2019 11:16 IST|Sakshi
భర్త నిరుపమ్,కుమారుడుఅక్షజ్‌తోమంజుల

సీరియల్‌

‘చంద్రముఖి’గా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ ఆడపడుచు మంజుల తెలుగింటి కోడలు అయింది. మా ఇంటి ‘కృష్ణవేణి’ అంటూ తన నటనతో అందరిచేత మెప్పు పొందుతోంది. తన సహనటుడు నిరుపమ్‌ పరిటాలను పెళ్లి చేసుకున్న మంజుల చెబుతున్న ముచ్చట్లివి.

చిన్నవయసులోనే తల్లిగా నటిస్తున్నారు..
నేను ఇప్పుడు నటిస్తున్న ‘కృష్ణవేణి’ సీరియల్‌ ‘స్టార్‌ మా’ టీవీలో వస్తోంది. ఇందులో స్టోరీ దాదాపుగా నాతోనే ముడి పడి ఉంటుంది. తల్లి క్యారెక్టర్‌ అయినా స్వతంత్రభావాలు గల పాత్ర. అందుకే ఒప్పుకున్నాను.  

ఈ ఫీల్డ్‌కి ఎలా వచ్చారు?
మాది బెంగుళూరు. మా నాన్నగారు పోలీసాఫీసర్‌. తను యాక్టర్‌ కూడా. నటన అంటే ఆయనకు పిచ్చి. మా నాన్నగారి ఫ్రెండ్‌ సలహాతో చిన్నప్పటి నుంచే అలా నేనూ యాక్టింగ్‌లోకి వచ్చాను. కన్నడలో పదికి పైగా సీరియల్స్‌లో నటించాను. ఇప్పుడు తెలుగుతో పాటు తమిళ్‌లో కూడా ఓ సీరియల్‌ చేస్తున్నాను. ‘చంద్రముఖి’ సీరియల్‌ చేస్తున్నప్పుడు ఇక్కడి భాష రాదు. తర్వాత మెల్లగా నేర్చుకున్నాను. తెలుగులోనూ పదికి పైగా సీరియల్స్‌ చేశాను.

నలుగురు అక్కచెల్లెళ్లు అన్నారు..
 అవును, అక్క స్కూల్‌ టీచర్‌. నేను రెండవ అమ్మాయిని. మూడవ అమ్మాయి హౌజ్‌వైఫ్‌. చిన్నది కీర్తి. తనూ సీరియల్స్‌లో నటిస్తోంది. అమ్మ హౌజ్‌వైఫ్‌. మేమందరం కలిస్తే సందడే సందడి.

నిరుపమ్‌తో మీ పరిచయం, ప్రేమ..
‘చంద్రముఖి’ మా ఇద్దరికి మొదటి సీరియల్‌. మా ఇద్దరి లక్షణాలు ఒకేలా ఉంటాయి. నేను సైలెంట్‌గా నా పనేదో నేను అన్నట్టు ఉంటాను. నిరుపమ్‌ కూడా అలాగే సైలెంట్‌గా ఉంటారు. ఏడాది వరకు అలాగే ఉన్నాం. అనుకోకుండా మా మధ్య ఒక మేసేజ్‌ షేర్‌ అయ్యింది. అక్కణ్ణుంచి మెసేజ్‌లు, మాటలు పెరిగాయి. చంద్రముఖి సీరియల్‌ ఆరున్నరేళ్ల పాటు నడిచింది. ఆ టైమ్‌లోనే మా ప్రేమ, పెళ్లి, బాబు పుట్టడం అన్నీ జరిగాయి (నవ్వుతూ). మా ఇద్దరి కుటుంబాల వాళ్లు యాక్టింగ్‌ ఫీల్డ్‌లో ఉన్నవారే. మా మామగారు ఓమ్‌కార్‌ పరిటాల నటుడు, రచయితగా పేరున్నవారు.

పుట్టినిల్లు – మెట్టినిల్లు
అన్ని పండగలు, పద్ధతులు ఒకేలా ఉన్నాయి. పెద్దగా తేడా లేదు. కొన్ని మాత్రమే వేరు. పిల్లలకు అన్నప్రాసన చేయడం మా పుట్టింటివాళ్ల వైపు లేదు. ఇక్కడ మా బాబుకు ఆ వేడుక చేశాం. అలాగే అబ్బాయిలకు పంచెల ఫంక్షన్‌ అని లేదు. ఇక్కడ ఆ వేడుక చేయాల్సి ఉంది. అమ్మవాళ్ల వైపు ఉగాదికి వేపాకు–బెల్లం కలిపి తింటారు. ఇక్కడ షడ్రుచులతో పచ్చడి చేసుకుంటారు. అమ్మవాళ్లు శ్రావణమాసంలో ఇక్కడలా వ్రతం చేయరు. పూజలు చేస్తారు.

వర్క్‌– ఫ్యామిలీ బ్యాలెన్స్‌
నెలలో 15 రోజులు వర్క్‌. మిగతా 15 రోజులు ఫ్యామిలీతో కలిసేలా ప్లాన్‌ చేసుకుంటాను. మా బాబు అక్షజ్‌ ఓమ్‌కార్‌కి ఎనిమిదేళ్లు. మా కంపౌండ్‌లో మిగతా పిల్లల తల్లులను చూసి ‘అమ్మా, నువ్వు కూడా టీచర్, డాక్టరయితే ఈవెనింగ్‌ నాతో ఉండేదానివి కదా! అంటుంటాడు. అందుకే మిగతా రోజులన్నీ వాడితోనే స్పెండ్‌ చేసేలా జాగ్రత్త తీసుకుంటాను. ప్రతి వేసవిలోనూ, నవరాత్రి సెలవుల్లో అందరం అమ్మవాళ్లింట్లో కలుస్తాం.  

స్వీట్‌ మెమరీస్‌!
నా జీవితంలో రెండు విషయాలు ఎప్పటికీ మరిచిపోలేను. మా పెళ్లికి పేరెంట్స్‌ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్‌ రాలేదు. కానీ, తుపాన్‌ రూపంలో పెద్ద సమస్య వచ్చింది. మా పెళ్లి విజయవాడలో, రిసెప్షన్‌ బెంగుళూరులో అని డిసైడ్‌ అయ్యాం. అప్పుడు పెద్ద తుపాన్‌. నా పెళ్లికి నేను వెళ్లడానికి చాలా కష్టమైంది. నేను పెళ్లి మంఠపం చేరుకునేంతవరకు అందరూ టెన్షన్‌ పడ్డారు. మొత్తానికి ఎలాగోలా చేరుకున్నాను. మా సిస్టర్స్‌ నా పెళ్లయ్యాక చేరుకున్నారు. ఇది ఎప్పటికీ మర్చిపోలేను. ఇక రెండవది ‘చంద్రముఖి’ సీరియల్‌ టైమ్‌లోనే నేను, మా ఆయన దుబాయ్‌కి వెళ్లాం. మా ఇద్దరికీ అక్కడి లేక్‌ బోట్‌లో సాంగ్‌ షూటింగ్‌. బోట్‌ చివరలో ఇద్దరం టైటానిక్‌ పోజ్‌లో నిల్చున్నాం. మా చుట్టూ పడవల్లో కెమరాలతో షూట్‌ చేస్తున్నారు. మేమున్న బోట్‌ కదులడంతో నీళ్లలో పడిపోయా. ఆ టైమ్‌లో నిరుపమ్‌ గట్టిగా పట్టుకున్నారు. అప్పుడే చచ్చిపోతాను అనుకున్నా.

ఇద్దరిదీ ఒకే ఫీల్డ్‌ సమస్యలు వస్తే!
చాలా త్వరగానే పరిష్కరించుకుంటాం. నాకు కొంచెం పొసిసెవ్‌ ఎక్కువ. ఆయనతో కంపేర్‌ చేస్తే నాకే కోపం ఎక్కువ. ఆయనే కూల్‌ చేస్తుంటారు. షూటింగ్‌లో ఆయన వేరే నటితో కలిసి యాక్ట్‌ చేయాల్సి ఉంటుంది. అలాంటి సందర్భాల్లో చూసినప్పుడు మాత్రం ఫీలవుతాను. కొద్దిసేపట్లోనే ‘ఇదే మా జీవితం కదా!’ అని నాకు నేను సర్దిచెప్పుకుంటాను.

డ్రీమ్స్‌..
బీకామ్‌ చేశాను కాబట్టి అకౌంటెంట్‌ అవాలనుకున్నా. యాక్టింగ్‌ ఫీల్డ్‌ నా కల కూడా కాదు. అనుకోకుండా వచ్చాను. ఇద్దరం వర్క్‌లో బిజీ. ఇద్దరం కలిసి ఉండేది తక్కువ సమయం. తనతో బయటకెళ్లాలి అని, నేనూ, బాబు, తనూ కలిసి ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటాను.– నిర్మలారెడ్డి

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆరోగ్య ‘సిరి’ధాన్యాలు

ఒకేలా కనిపిస్తారు.. ఒకేలా అనిపిస్తారు

ఇదీ భారతం

మూర్ఛకు చెక్‌ పెట్టే కొత్తిమీర!

మంచి నిద్రకు... తలార స్నానం!

నేత్రదానం చేయాలనుకుంటున్నా...

హలో... మీ అమ్మాయి నా దగ్గరుంది

రియల్‌ లైఫ్‌ లేడీ సింగం

కోటల కంటే ఇల్లే కష్టం

గర్భవతులకు నడక మంచి వ్యాయామం!

ఇక ద్రవాలూ అయస్కాంతాలే!

కీళ్ల కదలికలతోనూ విద్యుత్తు...

అమ్మాయికి మొటిమలు వస్తున్నాయి..?

వెనిస్‌ వాకిట్లో బాంబే రోజ్‌

కొత్త గర్ల్‌ ఫ్రెండ్‌... కొత్త బాయ్‌ఫ్రెండ్‌

‘జంకు’.. గొంకూ వద్దు!

హాహా హూహూ ఎవరో తెలుసా?

కడుపులో కందిరీగలున్న  స్త్రీలు

ఖాళీ చేసిన మూల

మెరిసే చర్మం కోసం..

బరువును సులువుగా తగ్గించే చనాచాట్‌

రుచుల్లో "మున"గండి...

కొవ్వుకణాలతో కేన్సర్‌కు మందులు

సింగపూర్‌లో శాకాహార హోటల్‌

సరయు : డాన్స్‌, ఫైట్స్‌, ఆర్ట్స్‌

హాలీవుడ్‌కి రష్యన్‌ పేరడీ!

శిక్ష ‘ఆటో’మాటిక్‌

మహిళా ఉద్యోగులకు డ్రెస్‌ కోడ్‌పై దుమారం

గుండెజబ్బును సూచించే రక్తపోటు అంకెలు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కరణ్‌కు నో చెప్పిన విజయ్‌ దేవరకొండ

చిరును కలిసిన పవన్‌, మనోహర్‌

‘ఆ 6 నెలలు నాకేం గుర్తు లేదు’

వైరల్ అవుతున్న రజనీ స్టిల్స్‌!

‘పెన్సిల్.. ఫేమస్‌ రివేంజ్‌ రైటర్‌’

బన్నీ సినిమాలో టబు లుక్‌!