అవిశ్వాసుల ఆగడాలు

15 Oct, 2016 22:52 IST|Sakshi
అవిశ్వాసుల ఆగడాలు

ప్రవక్త జీవితం

 

సత్యం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. ధర్మం విస్తరిస్తున్నకొద్దీ అవిశ్వాసుల ఆగడాలు కూడా అధికమయ్యాయి. ప్రవక్తను, ఆయన అనుచరులను రకరకాల మాటలనడం, అపనిందలు వేయడం, వారిపైకి రౌడీమూకలను ఉసిగొల్పడం లాంటి వేధింపులు పెరిగిపోయాయి. అయినా సమాజంలోని సద్వర్తనులు, ఆలోచనాపరులు ధర్మపరివర్తన చెందుతూనే ఉన్నారు. ప్రవ క్త అనుచరుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇది వారిని మరింత కలవరపాటుకు గురిచేస్తోంది.


ఒకరోజు అవిశ్వాస ప్రముఖులు కాబా గృహంలో కూర్చొని ఈ విషయమే చర్చించుకుంటున్నారు. ‘మనమంతా చచ్చిన తరువాత మళ్ళీ బ్రతికి లేస్తామట. ఇక్కడ చేసిన పనుల్ని గురించి అక్కడ సమాధానం చెప్పుకోవాలట. మంచిపనులు చేస్తే సత్ఫలితమట, చెడ్డపనులు చేస్తే దుష్ఫలితమట.. వింత వింతగా ఉన్నాయి కదా ఈ మాటలు.. ఎప్పుడైనా విన్నామా ఇలాంటి ప్రేలాపనలు’ అన్నాడు అందులోని ఒక వ్యక్తి.

 
‘అంతే కాదు, స్వర్గనరకాలు  కూడానట... బుద్ధిలేకపోతే సరి’ అన్నాడు మరోప్రబుద్ధుడు. ‘ఇదంతా కాదుగాని, అతన్నొకసారి ఇక్కడికి పిలిచి మాట్లాడదాం. నువ్వు చెప్పే మాటలకు రుజువులు, ఆధారాలు చూపించమని నిలదీద్దాం. ఈ విధంగా అతన్ని హింసించడానికి, వేధించడానికి మనకొక సాకు దొరుకుతుంది. ఎవరూ పల్లెత్తుమాట అనడానికి కూడా అవకాశం ఉండదు’ అన్నాడు మరొకడు.

 (వచ్చేవారం మరికొంత) - ఎండీ ఉస్మాన్‌ఖాన్

 

 

 

మరిన్ని వార్తలు