అమెరికా అధ్యక్షునిగా అబ్రహాం లింకన్

5 Nov, 2015 23:40 IST|Sakshi
అమెరికా అధ్యక్షునిగా అబ్రహాం లింకన్

ఆ నేడు 6 నవంబర్, 1860

అమెరికా 16వ అధ్యక్షునిగా అబ్రహాం లింకన్ ఎన్నికయ్యారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన అబ్రహామ్ లింకన్ తన సమీప ప్రత్యర్థులైన, డెమోక్రాట్స్ పార్టీ అభ్యర్థి స్టీఫెన్ ఎ. డౌగ్లస్‌ని, సదరన్ డెమోక్రాట్స్ అభ్యర్థి జాన్ సి. బ్రెకిన్‌రిడ్జ్‌ని, న్యూ కాన్‌స్టిట్యూషనల్ యూనియన్ పార్టీ అభ్యర్థి జాన్ బెల్‌ను ఓడించి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.

లింకన్ గెలుపుతో రిపబ్లికన్ పార్టీ మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చినట్లయింది. చాలా శక్తిమంతమైన, పాలనాదక్షత గల అధ్యక్షునిగా, గొప్ప రాజనీతిజ్ఞునిగా ప్రజల మనిషిగా అబ్రహాం లింకన్ మంచి పేరు తెచ్చుకున్నారు.
 

 
 

మరిన్ని వార్తలు