కంటి పరీక్ష ఇక ఇంట్లోనే...

14 Dec, 2019 01:46 IST|Sakshi

సైన్స్‌ బిట్స్‌

వయసుతోపాటు చూపు మందగించడం అందరికీ అనుభవమైన విషయమే. కళ్లజోళ్లతో ఆ చిక్కును కాస్తా దాటేస్తామనుకోండి. కాకపోతే తరచూ కళ్లు చెక్‌ చేయించుకోవడం, తగిన ప్రిస్క్రిప్షన్‌తో కళ్లజోళ్లు ఆర్డర్‌ చేయడం, వచ్చేదాకా పాతవాటితో సర్దుకుపోవడం కొంచెం చీకాకైన పనే. థ్యాంక్స్‌టు స్మార్ట్‌ఫోన్‌... ఇకపై ఆ సమస్య ఉండబోదు. ఓ బుల్లి పరికరం దాంతోపాటు పనిచేసే అప్లికేషన్‌తో ఎంచక్కా ఇంట్లోనే కళ్లు పరీక్షించుకునే అవకాశం కల్పిస్తోంది ఓ కంపెనీ.

ఐక్యూ విజన్‌ చెక్‌ అని పిలుస్తున్న ఈ కొత్త పరికరం, ఆప్‌ అత్యాధునిక మెషీన్‌ లెర్నింగ్‌ ఆధారంగా పనిచేస్తాయి. కళ్లు చెక్‌ చేసుకోవాలనుకున్నప్పుడు పరికరాన్ని స్మార్ట్‌ఫోన్‌ కు బిగించుకోవడం.. కళ్లజోళ్లు తీసేసి ఒక్కో కంటికి దగ్గరగా పెట్టుకుని పరీక్ష చేసుకోవచ్చు. కళ్ల ముందు కనిపించే రెండు గీతలను ఒకదానిపై ఒకటి చేర్చేలా ఐక్యూ యంత్రంపై ఉన్న బటన్‌లను నొక్కుతూండటం ఒక్కటే మనం చేసే పని. కంటిలోని ప్రతి కోణం నుంచి వివరాలు సేకరించి మన దష్టి మాంద్యం తీవ్రత ఎంతన్నది అంకెల్లో చెప్పేస్తుంది ఈ యంత్రం. ఆన్‌లైన్‌లో డిజైన్‌ ఎంచుకుని, ప్రిస్క్రిప్షన్‌ను జోడిస్తే ఒకట్రెండు రోజుల్లో కొత్త కళ్లజోడు రెడీ!

మరిన్ని వార్తలు