ఇంటిప్స్‌

4 Dec, 2017 01:57 IST|Sakshi

కీర దోస, బీర కాయలు కొన్ని చేదుగా ఉంటాయి. చెక్కు తీసే ముందే వాటిని మధ్యలోకి విరిస్తే చేదుబారవు.
తేనె స్వచ్ఛత తెలియాలంటే, ఒక కప్పు నీటిలో ఒక స్పూన్‌ తేనె వేయాలి. నీటిలో కరగకుండా అడుగుకు చేరితే అది మంచి తేనె.
ఉప్పు నీటికోసం నీళ్లు మరిగిన తర్వాత ఉప్పు కలపాలి. ముందే ఉప్పు వేస్తే మరగడానికి ఎక్కువ సమయం పడుతుంది.
వెల్లుల్లి పొట్టు త్వరగా రావాలంటే నీటిలో నానబెట్టాలి.
అప్పడాలను పాలిథిన్‌ కవర్‌లో పెట్టి పప్పులు, బియ్యం డబ్బాలో పెడితే విరిగి పోకుండా ఉంటాయి.
కూరల్లో ఉప్పు ఎక్కువైతే కొబ్బరి పొడి లేదా గసాల పొడి చల్లాలి. అలాగే కొబ్బరి ముక్కలను కూరలో వేసి పదిహేను నిమిషాల తర్వాత తీసివేయాలి. ఎక్కువైన ఉప్పుని కొబ్బరి ముక్క పీల్చుకుంటుంది.

మరిన్ని వార్తలు