రక్తపోటును నియంత్రించే అరటిపండు

28 Nov, 2017 01:19 IST|Sakshi

అరటిపండు అన్ని వేళలా అందుబాటులో ఉంటుంది. రెడీగా ఆరోగ్యాన్నిస్తుంది. ఈ పండు చేకూర్చే ఆరోగ్య ప్రయోజనాల్లో కొన్ని ...
అరటిపండులో పొటాషియమ్‌ పాళ్లు చాలా ఎక్కువ. దాంతో అది రక్తపోటును స్వాభావికంగా నియంత్రిస్తుంది
ఇందులో ఉండే పొటాషియమ్‌ గుండె ఆరోగ్యాన్ని కాపాడేందుకు తోడ్పడుతుందని యూనివర్సిటీ ఆఫ్‌ అలబామా పరిశోధకుల అధ్యయనాల్లో తేలింది.
అరటిపండులోని ట్రిప్టోఫాన్‌ను మన శరీరం సెరిటోనిన్‌గా మార్చుకుంటుంది. ఈ సెరిటోనిన్‌ మన మూడ్స్‌ బాగుండేలా చూసే రసాయనం
అరటిపండులో పీచు (ఫైబర్‌) పుష్కలంగా ఉంటుంది. అది మన జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుతుంది
అరటిలోని అమైనో యాసిడ్స్‌ అద్భుతమైన జ్ఞాపకశక్తికి, మెదడు చురుకుగా పనిచేయడానికి ఉపయోగపడతాయి
అరటిపండు కంటి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. మాక్యులార్‌ డీజనరేషన్‌ వంటి కంటి వ్యాధులను నివారిస్తుంది
అరటిలో క్యాల్షియమ్‌ పాళ్లు ఎక్కువ. అందుకే ఇది ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంతేగాక వీటిలోని క్యాల్షియమ్‌ మన ఒంట్లోకి తేలిగ్గా ఇంకేలా అరటిపండులోనే పుష్కలంగా ఉండే ఫ్రక్టోలిగోశాకరైడ్స్‌ అనే పదార్థం దోహదం చేస్తుంది
అరటిపండు అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది.

మరిన్ని వార్తలు