నేను ఆ డాక్టర్‌ కాదు

2 Dec, 2019 01:10 IST|Sakshi

సాహిత్య మరమరాలు

ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రొఫెసర్, సాహితీ బంధువు డాక్టర్‌ వి.బాలమోహన్‌ దాసు 1977లో హైదరాబాద్‌ వెళ్లేందుకు విశాఖలో గోదావరి ఎక్స్‌ప్రెస్‌ 3 టైర్‌ స్లీపర్‌లో ప్రయాణిస్తున్నారు. ఉన్నట్టుండి ఇదే బోగీలో ఓ బాలునికి కడుపునొప్పి వచ్చింది. విలవిల్లాడిపోతున్నాడు. ఆందోళనకు గురైన టీటీఈ తన చార్టును తిరగేస్తే ఈ డాక్టర్‌ పేరు కనిపించింది. కొంచెం చికిత్స చేస్తారా అంటూ నిద్ర లేపాడు. తాను మెడికల్‌ డాక్టర్‌ను కాదనీ, కామర్స్, మేనేజ్‌మెంట్‌ సిద్ధాంత గ్రంథం రాసి పీహెచ్‌డీ తెచ్చుకున్న డాక్టర్‌ననీ ఈయన జవాబిచ్చారు. అయితే, ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌ విధిగా తీసుకెళ్లే అలవాటున్న వాడవడంతో పిల్లాడికి బెరాల్గిన్‌ టాబ్లెట్‌ మాత్రం ఇచ్చారు. కడుపునొప్పి శాంతించింది. ఈ సంఘటన జరిగిన తర్వాత రిజర్వేషన్‌ చేయించుకునేటప్పుడు డాక్టర్‌ అనే మాటను రాయించడం మానుకున్నారాయన.
 

-వాండ్రంగి కొండలరావు
 

మరిన్ని వార్తలు