మీ ఇల్లే ప్రేమాలయం

14 Feb, 2018 01:09 IST|Sakshi

అంతటా ప్రేమమయంగా కనిపించే ఈ రోజున మీ ఇంటిలోనూ ప్రేమానురాగాలు వెల్లివిరియాలంటే చిన్న చిన్న కిటుకులున్నాయి.
పెళ్లయిన మొదట్లో మీ శ్రీవారు/శ్రీమతి మీకిచ్చిన కానుకలు, లేదంటే రాసిన ఉత్తరాలు .. ఏదో విధంగా అందంగా కనిపించేలా లవ్‌ సింబల్స్‌ స్టిక్కర్స్‌ పెట్టి అలంకరించవచ్చు.
ఫ్లవర్‌వేజ్‌ మీద లవ్‌ సింబల్స్‌ని అతికించి, అందమైన పువ్వులను అలంకరించి టేబుల్‌ మీద ఉంచండి. ఇంటి వాతావరణంతో పాటు మీ మనసులూ ఆహ్లాదభరితం అవుతాయి.
లవ్‌ సింబల్‌ని సూచించే ఫ్రేమ్‌లో మీ దంపతుల ప్రేమపూర్వకమైన ఫొటోని సెట్‌ చేసి, మీ భాగస్వామికి కనిపించేలా ఉంచండి. వీలైతే ఒక లవ్‌ కోట్‌ని మీ భాగస్వామికి సూచిస్తూ ఫ్రేమ్‌ మీద రాసి ఉంచండి.

ఇంకా ఇలాంటి ఐడియాలు మీకూ తడతాయి. ప్రయత్నించండి.

మరిన్ని వార్తలు