వారఫలాలు : 26 నవంబర్‌ నుంచి 2 డిసెంబర్‌ 2017 వరకు

26 Nov, 2017 00:59 IST|Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
అనుకున్న కార్యాలు నిర్విఘ్నంగా పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి.  మీ జీవితాశయం నెరవేరుతుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది. కొన్ని సమస్యలు, వివాదాల నుంచి బయటపడతారు. కాంట్రాక్టర్లు నూతనోత్సాహంతో ముందడుగు వేస్తారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. పారిశ్రామికవర్గాలకు సన్మానాలు. వారం మధ్యలో స్వల్ప అనారోగ్యం. ఖర్చులు. పసుపు, ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అమ్మవారికి పొంగలి నివేదించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోణి, మృగశిర 1,2 పా.)
ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులు సహాయపడతారు. రియల్‌ఎస్టేట్‌లు, కాంట్రాక్టర్లకు కలిసివచ్చే కాలం. దేవాలయాలు సందర్శిస్తారు. ఆస్తుల విషయంలో బంధువులతో వివాదాలు తీరతాయి. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపార లావాదేవీలు ఉత్సాహవంతంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు విధుల్లో అనుకూల పరిస్థితులు. కళాకారులు కొత్త అవకాశాలు అందుకుంటారు. వారం చివరిలో ధనవ్యయం. శ్రమాధిక్యం. నీలం, గులాబి రంగులు. ఉత్తరదిశప్రయాణాలు అనుకూలం. దేవాలయంలో ఉడికించిన సెనగలు పంచండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
చేపట్టిన కార్యాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆలోచనలు అమలు చేస్తారు. రియల్‌ఎస్టేట్‌ల వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. ప్రముఖులు పరిచయమవుతారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలు పురోగతిలో సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు రావచ్చు. పారిశ్రామికవర్గాలకు విదేశీయానం. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. వృథా ఖర్చులు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
అనుకున్న పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమ మరింత పెరిగే సూచనలు. బంధువులు, మిత్రులతో విభేదాలు ఏర్పడవచ్చు. దేవాలయాలు సందర్శిస్తారు. ప్రముఖుల నుంచి అందిన సమాచారంతో ఊరట చెందుతారు. ఆస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. వ్యాపారాలలో గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగులకు మరిన్ని బాధ్యతలు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో శుభవార్తలు. ధన, వస్తులాభాలు. ఎరుపు, గులాబి రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. అమ్మవారికి కుంకుమార్చన చేయండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ముఖ్యమైన కార్యక్రమాలు నిదానంగా కొనసాగుతాయి. బంధువర్గంతో మాటపట్టింపులు. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. జాగ్రత్త వహించండి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు ఒత్తిడులు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. పారిశ్రామికవర్గాలకు నిరుత్సాహం. వారం ప్రారంభంలో వాహనయోగం. ఆహ్వానాలు అందుతాయి. ఎరుపు, లేత పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాలయంలో అభిషేకం నిర్వహించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. బంధువులతో ఉత్సాహవంతంగా గడుపుతారు. స్థిరాస్తి వివాదాలు నెలకొంటాయి. తీర్థయాత్రలు విరివిగా చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. రియల్‌ఎస్టేట్‌ల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు మరింత పెరుగుతాయి. వారం చివరిలో వృథా ఖర్చులు. మిత్రులతో వివాదాలు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కొన్ని సమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. విద్యార్థులకు అనుకూల సమాచారం అందుతుంది. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.  వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. నీలం, పసుపు రంగులు. తూర్పుదిశప్రయాణాలు అనుకూలం. ఆంజనేయస్వామికి అర్చన చేయించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక విషయాలలో కొద్దిపాటి చికాకులు. బంధువులు మీపట్ల వ్యతిరేక భావాలను వ్యక్తం చేస్తారు. కొన్ని హామీలు  భారంగా మారే సూచనలు. స్నేహితులతో అకారణంగా వివాదాలు నెలకొనవచ్చు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. రాజకీయవర్గాలకు ఒత్తిడులు పెరుగుతాయి. వారం చివరిలో ధనలాభం. కార్యసిద్ధి. గులాబి, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
పనుల్లో అవాంతరాలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితిలో కొంత గందరగోళం. రుణదాతల నుంచి ఒత్తిడులు. ఆరోగ్యసమస్యలు చికాకు పరుస్తాయి. బంధువుల, మిత్రులతో విభేదాలు. శ్రమ తప్ప ఫలితం అంతగా ఉండదు. విద్యార్థులు, నిరుద్యోగులకు నిరుత్సాహం. వ్యాపార లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు పనిఒత్తిడులు. పారిశ్రామికవర్గాలకు పర్యటనలు వాయిదా. వారం ప్రారంభంలో ధన, వస్తులాభాలు. పాతమిత్రుల కలయిక. గులాబి, ఆకుపచ్చరంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. 111 గులాబీలతో దుర్గామాతకు అర్చన చేయండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఆదాయానికి మించిన ఖర్చులు. బంధువులతో వివాదాలు నెలకొంటాయి. విద్యార్థులకు ఒత్తిడులు. ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆరోగ్యం మందగిస్తుంది. విలువైన వస్తువులు జాగ్రత్తపర్చుకోండి. ఉద్యోగయత్నాలు నెమ్మదిస్తాయి.   మిత్రుల నుంచి సమస్యలు ఎదురుకావచ్చు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. నీలం, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఈశ్వరారాధన మంచిది.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన విద్యావకాశాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. నలుపు, నీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
వ్యయప్రయాసలు తప్పకపోవచ్చు. చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగవు. కొంచెం ఇబ్బంది పడతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. దేవాలయాలు సందర్శిస్తారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. కళాకారులకు చికాకులు ఎదురవుతాయి. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. గులాబి, లేత పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రోజుకు వెయ్యి లీటర్ల నీటితోనే చేపల సాగు..

'పాడి'తో బతుకు 'పంట'!

సంతృప్తి.. సంతోషం..!

మళ్లీ మురిపి'స్టారు'

‘ప్రేమ’ లేకుండా పోదు

నలుగురు ఓహ్‌ బేబీలు

పక్కింటి ఎండమావి

చీకటికి అలవాటుపడని కళ్లు

పెత్తనం పోయి కర్ర మిగిలింది

ఎత్తయిన సిగ్గరి

యువత. దేశానికి భవిత

బజ్జీ బిర్యానీ.. స్నాకం 'పాకం'

మద్దూరు వడను వదిలేస్తే బాధపడకతప్పదు..

చందమామ నవ్వింది చూడు

ఆఫీస్‌ ఇలా ఉండకూడదు

ప్లాస్టిక్‌ ఇల్లు

సౌరశక్తి ప్లాంట్‌లలో అబూదాబి రికార్డు!

మ్యావ్‌ మ్యావ్‌... ఏమైపోయావ్‌!

మా అమ్మపై ఇన్ని పుకార్లా

చక్కెర చాయ్‌తో క్యాన్సర్‌!

చిన్నారుల కంటి జబ్బులకు చికిత్సాహారం

మేము సైతం అంటున్న యాంకర్లు...

ఒత్తిడి... వంద రోగాల పెట్టు

చేతులకు పాకుతున్న మెడనొప్పి... పరిష్కారం చెప్పండి

మేనత్త పోలిక చిక్కింది

ఆ టీతో యాంగ్జైటీ మటుమాయం

టెడ్డీబేర్‌తో సరదాగా ఓరోజు...!

వినియోగదారుల అక్కయ్య

‘జర్నలిస్ట్‌ కావాలనుకున్నా’

సోపు.. షాంపూ.. షవర్‌ జెల్‌..అన్నీ ఇంట్లోనే!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

గొప్పమనసు చాటుకున్న లారెన్స్‌

సూర్య వ్యాఖ్యలపై దుమారం

నటి జ్యోతికపై ఫిర్యాదు

ఆ ఒక్కటి తప్ప..

ఇక షురూ

కొత్తదనం లేకపోతే సినిమా చేయను