వారఫలాలు : 8 అక్టోబర్‌ నుంచి 14 అక్టోబర్‌ 2017 వరకు

8 Oct, 2017 11:16 IST|Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఉత్సాహంగా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ, ప్రేమ పొందుతారు.  ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. రాబడి సంతృప్తినిస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. పారిశ్రామికవర్గాల కృషి ఫలిస్తుంది. వారం మధ్యలో స్వల్ప అనారోగ్యం. ధనవ్యయం. పసుపు, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తుతి మంచిది.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోణి, మృగశిర 1,2 పా.)
చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి కాగల సూచనలు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక సమస్య నుంచి బయటపడతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. కళాకారులు, రియల్‌ ఎస్టేట్‌ల వారికి శుభవార్తలు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, లేత పసుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయస్వామి దండకం పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
రాబడి ఆశాజనకమే. ముఖ్య కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆస్తి వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. విద్యార్థుల యత్నాలు సఫలం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకోని బాధ్యతలు దక్కుతాయి. రాజకీయవర్గాలకు మంచి గుర్తింపు రాగలదు. వారం చివరిలో ధనవ్యయం. స్వల్ప వివాదాలు. లేత ఎరుపు, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
వీరికి పట్టింది బంగారమే అన్నట్టుంటుంది. కార్యజయం. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. గృహయోగ సూచనలు. మీ సత్తా చాటుకునేందుకు తగిన సమయం. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల సమాచారం. ఆర్థిక విషయాలు ఆశాజనకం. బంధువులతో వివాదాలు తీరతాయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు పైస్థాయి వారి ప్రశంసలు అందుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. పసుపు, లేత ఆకుపచ్చరంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీ నృసింహస్తోత్రాలు పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
పనులు సజావుగా పూర్తి కాగలవు. కొంత శ్రమ పడ్డా ఫలితం కనిపిస్తుంది. విద్యార్థుల యత్నాలు అనుకూలిస్తాయి. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. మనస్సాక్షికి అనుగుణంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మీకు మద్దతునిచ్చే వారు పెరుగుతారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి దక్కవచ్చు. రాజకీయవర్గాలకు శుభవార్తలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ఎరుపు, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
కొన్ని సమస్యలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. బంధువులు, మిత్రులతో  ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. కార్యక్రమాలు కొన్ని సకాలంలో పూర్తి కాగలవు. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. సోదరులు, తల్లి తరఫు వారి నుంచి శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలలో అవరోధాలు అధిగమిస్తారు. ఉద్యోగులకు గుర్తింపు రాగలదు. కళాకారులు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. వారం ప్రారంభంలో ఖర్చులు. మానసిక అశాంతి. ఆకుపచ్చ, పసుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
అనుకున్న పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. రాబడి ఆశాజనకమే. రుణభారాలు తొలగుతాయి. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు సాగిస్తారు. రియల్‌ఎస్టేట్, కాంట్రాక్టర్లకు కొంత అనుకూల సమయం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు ఉంటాయి. కళాకారుల యత్నాలలో కదలికలు. వారం మధ్యలో ఆరోగ్యసమస్యలు. వ్యయప్రయాసలు. నీలం, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.
 
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
అనుకున్నది సాధించే వరకూ విశ్రమించరు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. పెండింగ్‌ పనులు పూర్తి కాగలవు. వాహనాలు, విలువైన వస్తువులు కొంటారు. జీవిత భాగస్వామి సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు. వారం చివరిలో వృథా ఖర్చులు. స్వల్ప అనారోగ్యం. ఆకుపచ్చ, ఎరుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
రాబడి ఆశాజకనంగా ఉంటుంది. అనుకున్న కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఒక పాత సంఘటన గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకూల మార్పులు ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గులాబీ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. రియల్‌ ఎస్టేట్‌ రంగం వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. మీ కార్యదీక్షకు కుటుంబసభ్యులు ఆశ్చర్యపోతారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. కళాకారులకు అవకాశాలు పెరుగుతాయి. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు, అనారోగ్యం. నీలం, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఓర్పు, నేర్పుతో కొన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంటుంది. విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. కాంట్రాక్టర్లకు అనుకూల సమయం. తీర్థయాత్రలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు శుభవార్తలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. నలుపు, లేత నీలం రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ చాలీసా పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
అనుకున్న పనుల్లో ఆటంకాలు ఎదురుకావచ్చు. ఆర్థిక విషయాలలో ఆచితూచి వ్యవహరించండి. తొందరపాటు మాటలతో ఆప్తులతో వివాదాలు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. ఒక ఆసక్తికర సమాచారం అందుతుంది. నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. ఉద్యోగులకు మార్పులు ఉంటాయి. రాజకీయవర్గాలకు చికాకులు తప్పకపోవచ్చు. వారం మధ్యలో విందువినోదాలు. వాహనయోగం. గులాబీ, లేత ఎరుపు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నిర్లవణీకరణకు కొత్త మార్గం!

కార్బన్‌డైయాక్సైడ్‌ను ఆహారంగా మార్చేశారు!

సినిమా టైంలో కలిసిన ‘రోహిత్‌ సహానీ’..

తొలి అమెరికా పెళ్లికొడుకు

బొప్పాయి గుజ్జుతో మేని కాంతి

అభినయ శిల్పం

రోజుకు వెయ్యి లీటర్ల నీటితోనే చేపల సాగు..

'పాడి'తో బతుకు 'పంట'!

సంతృప్తి.. సంతోషం..!

మళ్లీ మురిపి'స్టారు'

‘ప్రేమ’ లేకుండా పోదు

నలుగురు ఓహ్‌ బేబీలు

పక్కింటి ఎండమావి

చీకటికి అలవాటుపడని కళ్లు

పెత్తనం పోయి కర్ర మిగిలింది

ఎత్తయిన సిగ్గరి

యువత. దేశానికి భవిత

బజ్జీ బిర్యానీ.. స్నాకం 'పాకం'

మద్దూరు వడను వదిలేస్తే బాధపడకతప్పదు..

చందమామ నవ్వింది చూడు

ఆఫీస్‌ ఇలా ఉండకూడదు

ప్లాస్టిక్‌ ఇల్లు

సౌరశక్తి ప్లాంట్‌లలో అబూదాబి రికార్డు!

మ్యావ్‌ మ్యావ్‌... ఏమైపోయావ్‌!

మా అమ్మపై ఇన్ని పుకార్లా

చక్కెర చాయ్‌తో క్యాన్సర్‌!

చిన్నారుల కంటి జబ్బులకు చికిత్సాహారం

మేము సైతం అంటున్న యాంకర్లు...

ఒత్తిడి... వంద రోగాల పెట్టు

చేతులకు పాకుతున్న మెడనొప్పి... పరిష్కారం చెప్పండి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’

అమ్మదగ్గర కొన్ని యాక్టింగ్‌ స్కిల్స్ తీసుకున్నాను..

నాన్నా.. బయటకు వెళ్లు అన్నాడు!