వారఫలాలు

22 Jul, 2018 01:08 IST|Sakshi

22 జూలై నుంచి 28 జూలై 2018 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ మీది ఫలితం వేరొకదిగా ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. బంధువులతో విభేదాలు ఏర్పడతాయి. గృహ నిర్మాణయత్నాలలో అవాంతరాలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్లు, పనిభారం పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం చివరిలో శుభవార్తలు. స్వల్ప ధనలాభం. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
ఆర్థికంగా ఇబ్బంది పడతారు. సోదరులు, సోదరీలతో అకారణంగా వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. భూవివాదాలు నెలకొంటాయి. దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. ఉద్యోగయత్నాలు నిదానంగా సాగుతాయి. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిభారం పెరుగుతుంది. రాజకీయవర్గాలకు చికాకులు తప్పకపోవచ్చు. వారం ప్రారంభంలో ధన, వస్తులాభాలు. నూతన పరిచయాలు. నేరేడు, లేత పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. 

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. కోర్టు కేసులు పరిష్కారదశకు చేరతాయి. వాహనయోగం. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. కళారంగం వారికి సత్కారాలు. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
అనుకున్న వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆలయాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం. బంధువుల నుంచి శుభవార్తలు. భూములు, వాహనాలు కొంటారు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. నిరుద్యోగుల యత్నాలు కొంతమేరకు ఫలిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ఎరుపు, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆర్థిక వ్యవహారాలు కాస్త ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగయత్నాలు నిదానంగా సాగుతాయి. సోదరులు, సోదరీలతో అకారణంగా విభేదాలు నెలకొంటాయి. కొన్ని పనులు మందకొడిగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆరోగ్యం కొంత చికాకు పరుస్తుంది. వ్యాపార లావాదేవీలు అంతగా అనుకూలించవు. జాగ్రత్త వహించండి. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి ఒత్తిడులు తప్పవు. వారం చివరిలో వస్తులాభాలు. ఆకస్మిక ధనలబ్ధి. గులాబీ, తెలుపు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
అనుకోని ఖర్చులు ఎదురై అప్పులు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. బంధువులతో తగాదాలు పడి, మనశ్శాంతి కొంత కరువవుతుంది. ముఖ్యమైన పనులు మధ్యలో వాయిదా వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. కాంట్రాక్టర్లకు నిరాశాజనకంగా ఉంటుంది. అనారోగ్య సూచనలు. ఇంటి నిర్మాణాలలో అవరోధాలు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు. రాజకీయవర్గాలకు గందరగోళ పరిస్థితులు. వారం ప్రారంభంలో శుభవార్తలు. వాహనయోగం. ఆకుపచ్చ, లేత ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
అనుకున్న పనులు నత్తనడకన  కొనసాగుతాయి. బంధువులతో విభేదాలు ఏర్పడవచ్చు. శ్రమ మరింతగా పెరుగుతుంది. ఆరోగ్య, కుటుంబసమస్యలు చికాకు పరుస్తాయి. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు.  వ్యాపారాలలో పెట్టుబడులు ఆలస్యమవుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తప్పవు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో విందువినోదాలు. ఉద్యోగలాభం. నేరేడు, గులాబీ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌ను పూజించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
కొత్త వ్యక్తులు పరిచయం సంతోషం కలిగిస్తుంది. ఆప్తులు మీ అభివృద్ధిలో కీలకం కాగలరు. ఇంటర్వ్యూలు అందుకుంటారు. ఇంటాబయటా మీకు ఎదురులేని పరిస్థితి ఉంటుంది. సోదరులతో విభేదాలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి విషయాలలో ఒప్పందాలు చేసుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. కళారంగం వారికి నూతన అవకాశాలు. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. పసుపు, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
వ్యవహారాలలో ఆటంకాలు. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. మిత్రులతో కలహాలు. సేవాకార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. శ్రమకు తగిన ఫలితం రాక డీలా పడతారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. ముఖ్య నిర్ణయాలలో తొందరపాటు వద్దు. తీర్థయాత్రలు చేస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు నెమ్మదిస్తాయి. వ్యాపారాలలో సమస్యలు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి యత్నాలలో అవాంతరాలు. వారం మధ్యలో శుభవార్తలు. ప్రముఖులతో పరిచయాలు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
నూతన ఉద్యోగప్రాప్తి. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. కొన్ని వివాదాలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు.  జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభ సూచనలు. ఆరోగ్యం కుదుటపడుతుంది. వేడుకల్లో పాల్గొంటారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు దక్కుతాయి. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమర్థతను నిరూపించుకుంటారు. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం  మధ్యలో వివాదాలు. అనుకోని ఖర్చులు. నీలం, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
అనుకున్న విధంగా వ్యవహారాలు చక్కదిద్దుతారు. ప్రముఖుల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. కొత్త వ్యక్తులు పరిచయమై ఉత్సాహాన్నిస్తారు. సంఘంలో మరింత పేరు గడిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి పెడతారు. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సానుకూలం. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు దక్కించుకుని, ఆ విజయాన్ని ఆస్వాదిస్తుంటారు. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబసమస్యలు. లేత ఆకుపచ్చ, నలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
వీరికి అన్నింటా విజయాలే. ఆర్థికంగా గతం కంటే మెరుగ్గా ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.  ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఒక కీలకమైన కేసు పరిష్కారమవుతుంది. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు మరింతగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఊహించని హోదాలు రావచ్చు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు, సన్మానాలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. గులాబీ, లేత ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు

టారో (22 జూలై నుంచి  28 జూలై, 2018 వరకు)
మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
సాహసోపేతమైన కొత్త కార్యక్రమాన్ని తలపెడతారు. ఇది మీ జీవితంలో కొత్త ప్రారంభానికి నాంది పలుకుతుంది. దీనివల్ల సత్ఫలితాలను అందుకుంటారు. కొన్ని అనుకోని సమస్యలు చుట్టుముట్టడం వల్ల సహనం కోల్పోయే పరిస్థితులు ఉంటాయి. వారసత్వ సంపద కలసివచ్చే సూచనలు ఉన్నాయి. ఏకాగ్రతకు భంగం కలిగే సూచనలు ఉన్నాయి. చేపట్టిన పనులపై పూర్తి దృష్టి సారించి, అప్రమత్తంగా ఉన్నట్లయితే మెరుగైన ఫలితాలను సాధించగలరు. బంధు మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహభరితంగా సాగుతాయి. 
కలిసివచ్చే రంగు: నీలం

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
మీదైన శైలిలో ముందుకు సాగుతూనే మీరు ఇతరుల దృష్టిని ఆకట్టుకుంటారు. మీరు సాధించిన పురోగతి పట్ల మీ తల్లిదండ్రులు సంతృప్తి చెందుతారు. మిత్రుల మధ్య నవ్వుతూ తుళ్లుతూ ఉల్లాసభరితంగా కాలం గడుపుతారు. జీవిత భాగస్వామి నుంచి ప్రోత్సాహం దొరుకుతుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేస్తారు. అదృష్టాన్ని తెచ్చిపెట్టే అద్భుత అవకాశం మీ తలుపు తడుతుంది. వృత్తి వ్యాపారాల్లో అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. అవసరాల్లో ఉన్న బంధు మిత్రులకు బాసటగా నిలుస్తారు. సామాజికంగా ప్రజా సంబంధాలను మెరుగుపరచుకుంటారు.
కలిసివచ్చే రంగు: లేతనీలం

మిథునం (మే 21 – జూన్‌ 20)
పర్యవసానాలను లెక్క చేయకుండా అంతరాత్మ ప్రబోధానుసారం ముందుకు సాగుతారు. ఇతరులతో సంభాషణలు నెరపడానికి జరిపే చిన్న చిన్న చర్యలే అనూహ్యంగా పెద్ద పెద్ద ప్రతిఫలాలను ఇస్తాయి. భాగస్వాముల మధ్య పరస్పర విశ్వాసం, సాన్నిహిత్యం మరింతగా బలపడతాయి. ఇతరుల ప్రభావానికి దూరంగా ఉండటం క్షేమమని తెలుసుకుంటారు. ప్రతిభా పాటవాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. పలుకుబడి గల ప్రముఖుల సహాయం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. వైద్యుల సలహాపై ఆహార విహారాల్లో మార్పులు చేపడతారు.
కలిసివచ్చే రంగు: పసుపు

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడటానికి తగిన సాయం చేయడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తులను కలుసుకుంటారు. అద్భుతమైన పనితీరు కారణంగా ఉన్నతాధికారులు మీ పట్ల సానుకూలత చూపుతారు. మనసు చెప్పే మాట వింటారు. ఎటూ తేల్చుకోలేని ఊగిసలాట ధోరణి వల్ల కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం చేస్తారు. దూరమైన ప్రేమానుబంధాలకు మళ్లీ దగ్గరవుతారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకుంటారు. అప్పులు తీర్చేస్తారు. పిల్లలతో కాలక్షేపం చేస్తారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది.
కలిసివచ్చే రంగు: ఆకుపచ్చ

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
లక్ష్యసాధనలో అవరోధాలు, కష్టనష్టాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. వాటన్నింటినీ తట్టుకుని కేవలం లక్ష్యంపైనే దృష్టి నిలిపితే తప్పకుండా అనుకున్న ఫలితాన్ని సాధించగలుగుతారు. నిరాశలో కూరుకుపోతున్న దశలో ఆశాకిరణంలా కొత్తమార్గం దొరుకుతుంది. కాలం పెట్టిన పోటీలో మీరే విజేతగా నిలుస్తారు. అద్భుతమైన మేధాశక్తి, సృజనాత్మకత మీకు గుర్తింపునిస్తాయి. సామాజిక సంబంధాలు బలపడతాయి. అసూయాపరుల నుంచి కొన్ని సమస్యలు ఎదురైనా, ఉన్నతాధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.
కలిసివచ్చే రంగు: వెండిరంగు

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
గతం చేసిన గాయాల నుంచి తేరుకుంటారు. సానుకూల ఫలితాలను ఇచ్చే సరికొత్త దిశలో ముందుకు సాగుతారు. అయితే, భావోద్వేగాలను అదుపు చేసుకోవడం మంచిది. పనిలో సత్తా చాటుకుంటారు. గడ్డు సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతారు. ధ్యానం ద్వారా సాంత్వన పొందుతారు. దేవాలయాలను సందర్శిస్తారు. సేవా కార్యక్రమాలకు విరాళాలు ఇస్తారు. స్థిరాస్తి లావాదేవీలు కొలిక్కి వస్తాయి. కొత్త ఇల్లు లేదా కొత్త వాహనం సమకూరే సూచనలు ఉన్నాయి. పిల్లలు సాధించిన విజయాలు సంతృప్తినిస్తాయి. 
కలిసివచ్చే రంగు: నారింజ

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
తిరుగులేని పట్టుదలతో అవరోధాలను అవలీలగా అధిగమిస్తారు. కృతనిశ్చయంతో అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. అనుకున్న స్థాయిని మించి ఫలితాలను సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఘన విజయాలు సాధిస్తారు. కలలను నెరవేర్చుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానుబంధాలు మరింతగా బలపడతాయి. సామాజికంగా పేరు ప్రఖ్యాతులు ఇనుమడిస్తాయి. సుదూర యాత్రలకు వెళతారు. అద్భుతమైన ప్రదేశాలను సందర్శిస్తారు. సత్యాన్వేషణలో ముందుకు సాగుతారు. ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి సాధించడానికి సంకల్పిస్తారు.
కలిసివచ్చే రంగు: పసుపు

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
అద్భుతమైన అవకాశాలు అందివస్తాయి. విజయోత్సాహంతో ముందుకు సాగుతారు. ఊపిరిసలపని పనితో ఉక్కిరిబిక్కిరవుతారు. వరుస విజయాలతో అలసటను మరచిపోతారు. మీ పురోగతిలో పెనువేగానికి సన్నిహితులు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారు. ప్రేమికుల మధ్య అనుబంధం మరింతగా బలపడుతుంది. ఇతరుల అభిప్రాయాలకు మనసు పాడుచేసుకోకుండా ఉండటమే మంచిది. ఘర్షణ తలెత్తినప్పుడు మొండితనానికి పోకుండా, పట్టు విడుపులు ప్రదర్శించడం ద్వారా పరిస్థితులను చక్కదిద్దుకుంటారు. ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి.
కలిసివచ్చే రంగు: లేతాకుపచ్చ

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
ఇంటా బయటా మార్పులు చేపడతారు. ముఖ్యంగా వాస్తుకు సంబంధించి మార్పులు, పరిహారాలు చేపడతారు.  పనుల పురోగతిలో వేగం పుంజుకుంటుంది. మీ జీవితంలో అద్భుతమైన కాలం మొదలైనట్లే. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో నిపుణుల సలహాలు తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో పరిస్థితులు అదుపు తప్పే సూచనలు ఉన్నాయి. దీర్ఘకాలంగా కొనసాగిస్తూ వచ్చిన కీలకమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. కొత్త ఫర్నిచర్‌ను కొనుగోలు చేస్తారు. స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెడతారు. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండటం మంచిది.
కలిసివచ్చే రంగు: మీగడ రంగు

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
ప్రతిబంధకాల నుంచి బయటపడతారు. ఎంతోకాలంగా కోరుకుంటున్న స్వేచ్ఛా స్వతంత్రాలను మనసారా ఆస్వాదిస్తారు. మనస్సాక్షిని నమ్ముకుంటారు. మీ తీరు కొందరికి నచ్చకున్నా, మీదైన మార్గంలోనే ముందుకు సాగుతారు. సంగీతం, చిత్రలేఖనం వంటి లలిత కళల సాధనలో కొత్త ఉత్తేజాన్ని పొందుతారు. చిరకాల స్వప్నం నెరవేరే సూచనలు ఉన్నాయి. విహార యాత్రల్లో ఉల్లాసంగా గడుపుతారు. బంధు మిత్రులకు బాసటగా నిలుస్తారు. వృత్తి ఉద్యోగాల్లో విజయవంతంగా నాయకత్వ పాత్ర పోషిస్తారు. ఇతరులకు స్ఫూర్తినిస్తారు.
కలిసివచ్చే రంగు: తెలుపు

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
ప్రేమికుల మధ్య ప్రేమానురాగాలు ఇనుమడిస్తాయి. ఎంతోకాలంగా నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభిస్తారు. కొత్త ఉత్సాహాన్ని పుంజుకుంటారు. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. వారాంతంలో బంధు మిత్రులతో విందు వినోదాలను ఆస్వాదిస్తారు. ఒంటరిగా ఉంటున్న వారికి తగిన జంట దొరికే సూచనలు ఉన్నాయి. మనసైన వ్యక్తి ముందు మీ మనసులోని మాటను వెల్లడిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. కొత్త అవకాశాలు తలుపుతడతాయి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.
కలిసివచ్చే రంగు: ముదురు గోధుమ రంగు

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
ప్రతి అంశంలోనూ సంయమనం పాటించాల్సి ఉంటుంది. ఆచి తూచి అడుగేయాల్సి ఉంటుంది. ఇంటా బయటా శాంతి సామరస్యాల కోసం పరితపిస్తారు. ఆర్థిక లాభాలు అద్భుతంగా ఉంటాయి. అదనపు ఆదాయ అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. అసూయాపరులు మిమ్మల్ని తప్పుడు సలహాలతో తప్పుదారి పట్టించే సూచనలు ఉన్నాయి. అప్రమత్తంగా ఉన్నట్లయితే అలాంటి వారి ఉచ్చుల నుంచి తప్పించుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాల్లో మార్పులు చోటు చేసుకోవచ్చు. ఆధ్యాత్మిక కేంద్రాలను దర్శించుకుంటారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కలిసివచ్చే రంగు: లేతాకుపచ్చ
- ఇన్సియా టారో అనలిస్ట్‌ 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మల్టీ విటమిన్స్ పనితీరుపై సంచలన సర్వే

గుండె గాయం మాన్పేందుకు కొత్త పరికరం!

పుష్టిని పెంచే సూక్ష్మజీవులు...

మద్యం తాగినప్పుడు అసలేం జరుగుతుందంటే...

పుస్తకాంకితురాలు

ప్రతి మహిళ రుద్రమదేవిగా ఎదగాలి

అమ్మా.. నువ్వే నా డాక్టర్‌

నిర్లవణీకరణకు కొత్త మార్గం!

కార్బన్‌డైయాక్సైడ్‌ను ఆహారంగా మార్చేశారు!

సినిమా టైంలో కలిసిన ‘రోహిత్‌ సహానీ’..

తొలి అమెరికా పెళ్లికొడుకు

బొప్పాయి గుజ్జుతో మేని కాంతి

అభినయ శిల్పం

రోజుకు వెయ్యి లీటర్ల నీటితోనే చేపల సాగు..

'పాడి'తో బతుకు 'పంట'!

సంతృప్తి.. సంతోషం..!

మళ్లీ మురిపి'స్టారు'

‘ప్రేమ’ లేకుండా పోదు

నలుగురు ఓహ్‌ బేబీలు

పక్కింటి ఎండమావి

చీకటికి అలవాటుపడని కళ్లు

పెత్తనం పోయి కర్ర మిగిలింది

ఎత్తయిన సిగ్గరి

యువత. దేశానికి భవిత

బజ్జీ బిర్యానీ.. స్నాకం 'పాకం'

మద్దూరు వడను వదిలేస్తే బాధపడకతప్పదు..

చందమామ నవ్వింది చూడు

ఆఫీస్‌ ఇలా ఉండకూడదు

ప్లాస్టిక్‌ ఇల్లు

సౌరశక్తి ప్లాంట్‌లలో అబూదాబి రికార్డు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఘోర రోడ్డు ప్రమాదం : బాలనటుడు దుర్మరణం 

గర్భంతో ఉన్న చిత్రాలను విడుదల చేసిన శ్రుతి

నాన్నకు ప్రేమతో మిస్సయ్యాను

ఎక్కడైనా ఒకేలా ఉంటా

అడ్డంకులు మాయం!

కుశాలీ ఖుషీ