గ్రేటర్‌ గృహాలంకరణ

30 Sep, 2019 01:33 IST|Sakshi

ఇంటిప్స్‌

కొబ్బరి, కొన్ని కాయగూరలు తురమడానికి వంటింట్లో తురుము పీటను ఉపయోగిస్తాం. వీటిల్లో హ్యాండిల్‌ ఉన్నవి, గుండ్రటి, పొడవాటి, డబ్బా పరిమాణంలో ఉన్న గ్రేటర్స్‌ (తురుమేవి) మార్కెట్లో రకరకాల మోడల్స్‌లో లభిస్తుంటాయి. ముచ్చటపడో, అవసరానికో తెచ్చుకున్నా ఇవి పదును పోయి సరిగ్గా తురమకపోతే పాతసామాన్లలో పడేయాల్సిందే. అయితే అలా కాకుండా వీటిని గృహాలంకరణకు ఉపయోగించుకోవచ్చు! ఇంటికి వచ్చిన వారు.. రూపు మారిన ఈ గ్రేటర్స్‌ని అబ్బురంగా చూసి మిమ్మల్ని ‘గ్రేట్‌’ అనాల్సిందే.

►కరెంట్‌ పోయినప్పుడో.. క్యాండిలైట్‌ డిన్నర్‌కో గాలికి కొవ్వుత్తులు ఆరిపోతుంటే డబ్బా రూపంలో ఉండే గ్రేటర్‌ను లాంతరుబుడ్డీలా ఉపయోగించాలి. బాల్కనీలో విద్యుద్దీపాలను అందంగా అలంకరించడానికి ఇదో చక్కని మార్గం.

►చిన్న డబ్బాలా ఉండే చీజ్‌ గ్రేటర్‌లో రకరకాల పువ్వులను అమర్చి టేబుల్‌ మీద పెడితే అందమైన వేజ్‌ సిద్ధం.

►గ్రేటర్‌ డబ్బాను పెయింటింగ్‌తో అందంగా అలంకరించి.. దానికి చెవి రింగులు, హ్యాంగింగ్స్‌ సెట్‌ చేసుకొని డ్రెస్సింగ్‌ టేబుల్‌ మీద అమర్చుకోవచ్చు. ఇయర్‌ రింగ్స్‌ తీసుకోవడానికి సులువుగా ఉంటుంది.

►ఉడెన్‌ స్పూన్లు వేయడానికి సరైన హోల్డర్‌ లేకపోతేనేం.. తురుము డబ్బాను ఉపయోగించుకోవచ్చు.

►బోసిపోయిన వాల్‌ను ముచ్చటైన ఫ్రేమ్‌తో అలంకరించాలంటే.. నలు చదరంగా ఉండే ప్లేట్‌ లాంటి గ్రేటర్‌పైన చిన్న పెయింట్‌ వేసి అమర్చాలి.

మరిన్ని వార్తలు