వేదం శ్లాఘించిన స్త్రీ

11 Feb, 2018 00:36 IST|Sakshi

వేదాలు స్త్రీల గురించి ఏమన్నాయో కొన్ని విషయాలు చూద్దాం...


స్త్రీలు ధైర్యవంతులుగా ఉండాలి  – యజుర్వేదం 10.03 , స్త్రీలు మంచి కీర్తి గడించాలి – అధర్వణవేదం 14.1.20 , స్త్రీలు పండితులవ్వాలి – అధర్వణవేదం 11.5.18, స్త్రీ అందరిని జ్ఞానవంతుల్ని చేయాలి
– అధర్వణవేదం 14.2.74, స్త్రీ ఎప్పుడూ సంపదలతో సుఖంగా ఉండాలి – అధర్వణవేదం 7.47.2, స్త్రీలు ఎప్పుడూ జ్ఞానవంతులై, తెలివిగలవారై ఉండాలి – అధర్వణవేదం 7.47.1

పరిపాలన విషయంలో స్త్రీలు
పరిపాలనకు సంబంధించిన సభలు, సమావేశాల్లో స్త్రీలు కూడా పాల్గొనాలి – అధర్వణవేదం 7.38.4
దేశపరిపాలన, సామాజిక సంస్కరణలు, ప్రభుత్వ కార్యకలాపాలను స్త్రీలు ముందుండి నడిపించాలి –  ఋగ్వేదం 10.85.46
ఆస్తిహక్కు
పిత్రార్జితం (తండ్రి కూడబెట్టిన ఆస్తి) లో కుమారుడితో బాటు కుమార్తెకు కూడా సమాన హక్కు ఉంది – ఋగ్వేదం 3.31.1
కుటుంబం
సమాజానికి, కుటుంబానికి స్త్రీ రక్షకురాలిగా వ్యవహరించాలి – అధర్వణవేదం 14.1.20 
స్త్రీ సంపదను, ఆహారాన్ని అందించాలి. శ్రేయస్సును కలిగించేదై ఉండాలి  – అధర్వణవేదం 11.1.17 (స్త్రీకి సంపాదన ఉన్నప్పుడే ఆమె కుటుంబానికి సంపదను చేకూర్చగలుగుతుంది) 
ఉద్యోగాల్లో స్త్రీలు కూడా రథాలను నడపాలి – అధర్వణవేదం 9.9.2 , స్త్రీలు యుద్ధంలో పాల్గొనాలి  – యజుర్వేదం  16.44 (ఈ విషయంలో దుర్గాదేవియే స్త్రీలకు ఆదర్శం).
సత్యభామ శ్రీకృష్ణునితోపాటు కదనరంగానికి వెళ్లి, నరకాసురునితో యుద్ధం చేసి, ఆ దుష్టరాక్షసుని నిలువరించడమే ఇందుకు ఉదాహరణ.
దళపతి తరహాలో స్త్రీ సభలను ఉద్దేశించి ప్రసంగించాలి– ఋగ్వేదం 10.85.26
విద్య
పురుషులతో సమానంగా మీకు ఈ మంత్రాలను ఇవ్వడమేగాక, వీటిని అర్థం చేసుకునే శక్తిని మీకు ప్రసాదిస్తున్నాను. – ఋగ్వేదం 10–191–3
వేదాల్లోనే మైత్రేయి, గార్గి, లోపాముద్ర వంటి దాదాపు 30 పైగా మంత్రద్రష్టలైన స్త్రీ ఋషుల గురించి చెప్పబడింది.
వివాహం – విద్యాభ్యాసం
ఓ వధువా! (వధువు అంటే పెళ్ళికూతురు) వైదికజ్ఞానం నీకు అన్ని దిశల నుండి కలగాలి. వేదాల్లో ఉన్న జ్ఞానం పొందిన తరువాతనే నీవు జీవితానికి సంబంధించిన విషయాల మీద నిర్ణయం తీసుకో. నీవు మంచి కీర్తి గడించి, భర్తకు శుభాలను కలుగచేసేదానివిగా ఉండు. నీ అత్తవారింట్లో గౌరవప్రదమైన జీవితం గడుపు, నీ జ్ఞానంతో వారి ఇంటిని వృద్ధిపరుచు – అధర్వణవేదం 14–1–64
 (ముందు విద్యను పొందండి, ఆ తర్వాతే వివాహం చేసుకోండని స్త్రీలకు ఈ మంత్రంలో భగవంతుడు నిర్దేశించాడు).

మరిన్ని వార్తలు