మధుమేహులకు  శాకాహారం మేలు!

2 Nov, 2018 00:34 IST|Sakshi

రక్తంలో చక్కెర మోతాదులను నియంత్రించుకోవాలనుకుంటున్నారా? అయితే వీలైనంత వరకూ శాకాహారం ఎక్కువగా తీసుకోండి అంటోంది బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌. పండ్లు, కాయకూరలు, గింజలు, పప్పుదినుసులు, విత్తనాలు ఎక్కువగా తీసుకుంటూ.. వీలైనంత తక్కువ పశు ఆధారిత ఉత్పత్తులను వాడేవారికి మధుమేహం వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని తెలిసిందే. అయితే దీనికి కారణమేమిటన్నది మాత్రం స్పష్టం కాలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ మధుమేహంపై జరిగిన 11 అధ్యయనాల వివరాలను పరిశీలించడం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చామని శాస్త్రవేత్తలు తెలిపారు.

దాదాపు 23 వారాల పాటు జరిగిన ఈ అధ్యయనాల వివరాలను నిశితంగా పరిశీలించినప్పుడు శాకాహారం తీసుకునేవారి భౌతిక, మానసిక ఆరోగ్యం ఇతరుల కంటే మెరుగ్గా ఉన్నట్లు తేలింది. అంతేకాకుండా నాడీ సంబంధిత నొప్పులు కూడా శాకాహారుల్లో తక్కువగా ఉన్నట్లు తెలిసింది. పశు ఉత్పత్తులు తీసుకోవడం మానేసిన లేదా తగ్గించిన వారి ఫాస్టింగ్‌ బ్లడ్‌ గ్లూకోజ్‌ మోతాదుతో పాటు బరువులోనూ గణనీయమైన తగ్గుదల నమోదైంది. మరింత విస్తృత స్థాయిలో అధ్యయనాలు చేపట్టడం ద్వారా ఈ ఫలితాలను రూఢీ చేసుM 

మరిన్ని వార్తలు