మీకు తెలుసా?.. ఇదెవరి కవిత?

18 Nov, 2019 01:11 IST|Sakshi

ఈ మధ్య సాహితీ సహృదయులైన నా అమెరికన్‌ మిత్రులు కొందరికి, ఈ క్రింది పద్యం చదివి వినిపించాను.
'Who were we in our past life'
She became shy and giggled.
'What will be our future life'
She turned pale, amazed.
'How long our happiness last'
Tears in her eyes, she grew sad.

నా స్నేహితులు అన్నారు, It's great. You must publish it అని. ఈ పద్యమే, ఇక్కడ(అమెరికాలో) పుట్టి పెరుగుతూ, కాలేజీకి వెళుతున్న మా మేనకోడలికి వినిపించా. ఆ అమ్మాయి వెంటనే, ఐ I bet this must be from Elizabeth Barret Browning అన్నది. వీళ్లకి ఇది సుమారు వందేళ్ల కిందట తెలుగులో ఏలూరి వాడు, నండూరి సుబ్బారావు రాసిన యెంకి పాటకి, వెల్చేరు నారాయణరావు ప్రచురించిన అనువాదం (Twentieth Century Telugu Poetry, An Anthology, Oxford University Press, 2002) అని చెప్పి, నేను తెలుగు కవిత్వాన్ని ప్రపంచ కవిత్వంలో ఒక ముఖ్యభాగంగా చూసి, మురిసిపోయి గర్వపడ్డాను.    
సౌజన్యం: పర్‌స్పెక్టివ్స్‌ ప్రచురించిన ‘బహుళ’


-వేలూరి వేంకటేశ్వరరావు 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా