నవమి నాటి వెన్నెల నేను

17 Jun, 2019 00:49 IST|Sakshi

పదం పలికింది – పాట నిలిచింది

స్త్రీ, పురుషుడు– విడిగా సగం సగం. అసంపూర్ణం. నవమి, దశమి నాటి వెన్నెలలాగే. ఏ సగమెవరో మరిచేంతగా వారు ఒకటైపోయినప్పుడు సంపూర్ణం అవుతారు. పున్నమి రేయి అవుతారు. శివరంజని కోసం వేటూరి సుందరరామ్మూర్తి రాసిన పాట ఇది. దీనికి సంగీతం రమేశ్‌ నాయుడు. పాడినవారు సుశీల, బాలసుబ్రహ్మణ్యం. 1978లో వచ్చిన ఈ చిత్రానికి దర్శకుడు దాసరి నారాయణరావు. జయసుధ, హరిప్రసాద్‌ నటీనటులు.

నవమి నాటి వెన్నెల నేను
దశమి నాటి జాబిలి నీవు
కలుసుకున్న ప్రతి రేయీ
కార్తీక పున్నమి రేయీ
నీ వయసే వసంత రుతువై
నీ మనసే జీవన మధువై
నీ పెదవే నా పల్లవిగా
నీ నగవే సిగ మల్లికగా
చెరి సగమై ఏ సగమేదో
మరచిన మన తొలి కలయికలో

నీ ఒడిలో వలపును నేనై
నీ గుడిలో వెలుగే నేనై
అందాలే నీ హారతిగా
అందించే నా పార్వతిగా
మనమొకటై రసజగమేలే
సరస మధుర సంగమ గీతికలో 

మరిన్ని వార్తలు