డాక్టర్ సలహా లేకున్నా ఆ మందు వాడవచ్చా?

15 Aug, 2013 23:38 IST|Sakshi
డాక్టర్ సలహా లేకున్నా ఆ మందు వాడవచ్చా?

నా వయసు 34 ఏళ్లు. నాకు ఇటీవల అంగస్తంభనలు తగ్గాయి. నా అంతట నేనే మెడికల్ షాపుకు వెళ్లి వయాగ్రా టాబ్లెట్లు కొనుక్కోవచ్చా. అలా వయాగ్రా వాడటం వల్ల ఏమైనా ప్రమాదమా? నాకు తగిన సలహా ఇవ్వండి.
 -  కె.ఆర్.ఆర్., ఒంగోలు

 
సాధారణంగా యుక్తవయసులో ఉన్నవారికి అప్పుడప్పుడు అంగస్తంభన లోపాలు వచ్చి సతమతమవుతుంటారు. ఇలా కావడానికి నిర్దిష్టంగా కారణం ఏదీ ఉండదు. ఇటువంటి వారిలో వయాగ్రా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత వాళ్లలో ఆత్మవిశ్వాసం కలిగి తమంతట తామే ఎలాంటి టాబ్లెట్ల సహాయం లేకుండానే సెక్స్ చేయగలుగుతారు. కాని ఎవరు పడితే వాళ్లు స్వయం నిర్ణయం తీసుకుని వేసుకోడానికి  వయాగ్రా అన్నది జ్వరం తగ్గడానికి వేసుకునే పారాసిటమాల్ లాంటి మందు కాదు.

ఈ మందు చాలా ప్రమాదకరం కాకపోయినా కొద్దిమందిలో సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. ఇక గుండెజబ్బులు ఉండి కొన్ని రకాల మందులు తీసుకునేవారిలో మాత్రం ఇది ప్రమాదకరంగా పరిణమించవచ్చు. అంతేకాదు... సెక్స్ ప్రేరేపిత మందులను సరైన ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మడం, కొనడం చట్టబద్ధమైన నేరం. వయాగ్రాకు సరైన స్పెషలిస్ట్‌ల ప్రిస్క్రిప్షన్ అవసరం. అందువల్ల మీరు  యూరాలజిస్ట్‌ను / మెడికల్ స్పెషలిస్ట్‌ను సంప్రదించడం అవసరం.
 
 డాక్టర్ వి.చంద్రమోహన్, యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్,
 ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్‌బి, హైదరాబాద్

 

మరిన్ని వార్తలు