దేవీ అలంకారాలు

9 Oct, 2018 00:31 IST|Sakshi

మొదటిరోజు  శ్రీస్వర్ణకవచాలంకృత శ్రీదుర్గాదేవి

భక్తితో నమస్కరిస్తే చాలు... అమ్మలా అనుగ్రహించి, అన్ని కార్యాలలోనూ విజయాలను ప్రసాదించే బెజవాడ కనకదుర్గాదేవి ఆలయంలో ఏటా ఆశ్వయుజ శుద్ధ ప్రతిపద అంటే పాడ్యమి నుండి విజయదశమి వరకు వైభవంగా శ్రీదేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తారు. ఇది ఆనవాయితీ. ఈ సందర్భంగా అమ్మవారి రేపటి అలంకార విశేషాలు, పఠించవలసిన శ్లోకం, చేయవలసిన నివేదన, పూజించడం వల్ల కలిగే ఫలితాలను సాక్షి ఫ్యామిలీ పాఠకుల కోసం రోజూ ప్రత్యేకంగా అందిస్తుందని తెలియచేయడానికి సంతోషిస్తున్నాం. శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మొదటిరోజు బుధవారం అమ్మవారు శ్రీస్వర్ణ కవచాలంకృత శ్రీదుర్గాదేవిగా దర్శనమిస్తుంది. అమ్మవారిని బంగారు కవచాలతో, ఎరుపురంగు చీరతో అలంకరిస్తారు. 

నివేదన
ఆవునేతితో చేసిన పొంగలి
ఈరోజు పఠించవలసిన శ్లోకం:
సౌమ్యాని యాని రూపాణి త్రైలోక్యే విచరంతి తే!
యాని చాత్యుర్థ ఘోరాణి తైర్మాస్మాంస్తథా భువమ్‌
భావం: ఓ జననీ! ముల్లోకాలయందు సంచరిస్తుండే నీ సాత్త్విక రూపాలతో, మిక్కిలి భయంకరమైన స్వరూపాలతో మమ్మల్ని, ఈ సమస్త భూమండలాన్ని కాపాడు!
ఫలమ్‌: ఇంటిలో ఉన్న చిక్కులు తొలగి, శక్తి, సంపదలు కలుగుతాయి. 

మరిన్ని వార్తలు