వీసాల్జియా...

23 Nov, 2015 22:57 IST|Sakshi
వీసాల్జియా...

మెడిక్షనరీ

నాస్టాల్జియాలా వినిపిస్తోంది కదూ! మందెక్కువైన స్థితిలో చాలామంది నాస్టాల్జియాలోకే వెళతారు. కిక్కు తలకెక్కిన దశలో గతాన్నంతా తవ్వి తలకెత్తుకుంటారు. మర్నాడు నిద్రలేవడంతోనే తలదిమ్ముగా, కళ్లు మంటలుగా, కడుపులో వికారంగా ఉంటుంది. పక్క మీద నుంచి లేవడమే కష్టంగా ఉంటుంది. ఎలాగోలా కాలకృత్యాదికాలు కానిచ్చుకుని, రొటీన్‌లో పడ్డా... రోజంతా నిస్సత్తువగా, ఒళ్లంతా భారంగా అనిపిస్తుంది. డోసెక్కువైతే ఇలాగే ఉంటుంది మరి.

దీన్నే మామూలు భాషలో హ్యాంగోవర్ అంటారని తెలిసిందే. దీనినే వైద్య పరిభాషలో ‘వీస్టాల్జియా’ అంటారు. నార్వేజియన్ పదం ‘వీస్టా’ అంటే తప్పతాగడం వల్ల తలెత్తే ఇబ్బంది అని అర్థం. గ్రీకు భాషలో ‘ఆల్జియా’ అంటే నొప్పి అని అర్థం. ఈ రెండు పదాలను మిక్స్ చేసి ఈ పదాన్ని కనిపెట్టారు వైద్యులు.
 

మరిన్ని వార్తలు