థైరాయిడ్‌కీ మెడిసినే!

16 Apr, 2018 00:19 IST|Sakshi

గుడ్‌ ఫుడ్‌

జామలో రుచికి రుచి ఎలాగూ ఉండనే ఉంటుంది. దాంతో పాటు ఎన్నో వ్యాధులను ఎదుర్కొనే వ్యాధి నిరోధకశక్తి పుష్కలంగా ఉంది. జామ పండుతో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల్లో ఇవి కొన్ని.

►జామపండులో విటమిన్‌–ఏ చాలా ఎక్కువ. ఇది కంటిచూపును చాలాకాలం పాటు పదిలంగా కాపాడుతుంది. క్యాటరాక్ట్, మాక్యులార్‌ డీజనరేషన్‌ వంటి అనేక కంటి వ్యాధులను జామ నివారిస్తుంది. 

►జామలో చాలా శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉన్నాయి. అందుకే జామ అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. ముఖ్యంగా ప్రోస్టేట్, రొమ్ము క్యాన్సర్ల నివారణకు బాగా ఉపయోగపడుతుంది. 

►జామపండులో పీచు పదార్థాలు ఎక్కువ, చక్కెర పాళ్లు తక్కువ. అందుకే స్వాభావికంగా బరువు నియంత్రించడానికి ఇదెంతో మంచిది. అందుకే క్రమం తప్పకుండా జామ పండు తినేవారి బరువు చక్కటి నియంత్రణలో ఉంటుంది. 

►జామలో విటమిన్‌–సి పాళ్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇది విటమిన్‌–సి లోపించడం వల్ల వచ్చే స్కర్వీతో పాటు అనేక వ్యాధులనుంచి శరీరాన్ని రక్షించుకుంటుంది. 

►జామతో చాలా థైరాయిడ్‌ సంబంధిత వ్యాధులు నివారితమవుతాయి. 

►జామపండు తినేవారి మెదడు చురుగ్గా ఉంటుంది. ఇందులోని విటమిన్‌–బి6, విటమిన్‌ బి3 వంటి పోషకాలే దీనికి కారణం. మెదడులోని న్యూరాన్ల సమర్థమైన  పనితీరుకు పై విటమిన్లు అవసరం. దాంతో మెదడుకు చురుకుదనం సమకూరడంతో పాటు డిమెన్షియా, అలై్జమర్స్‌ వంటి వ్యాధులు సైతం నివారితమవుతాయి. 

►రక్తంలో కొలెస్ట్రాల్‌ పాళ్లను తగ్గించడానికి జామ ఉపకరిస్తుంది. అంతేకాదు... ఇది అధిక రక్తపోటును నివారిస్తుంది. 

మరిన్ని వార్తలు