హెల్త్‌ టిప్స్‌

2 Nov, 2019 03:38 IST|Sakshi

►కూరగాయ ముక్కలని పెద్దవిగా కట్‌ చేస్తే  వీటిలో లభించే విటమిన్స్‌ వృథా అవ్వవు.
►ప్రతిరోజూ నీళ్లలో తులసి ఆకులు వేసుకుని తాగాలి. ఇలా చేస్తే థ్రోట్‌ ఇన్ఫెక్షన్‌ క్రమంగా తగ్గుతుంది.
►క్యారెట్, టొమాటో కలిపి జ్యూస్‌చేసి, తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని నీళ్లలో కలుపుకుని తాగితే రక్తశుద్ధి అవుతుంది.
►తులసి ఆకులని మరిగించిన నీటితో స్నానం చేస్తే చర్మం పై రాషెస్‌ తగ్గుముఖం పడతాయి.
►జీలకర్ర, పంచదారని కలిపి నమిలితే కడుపు నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
►గ్లాసుడు నీళ్లలో పావు టీ స్పూన్‌ ఏలకుల పొడి కలుపుకుని తాగితే యూరినరీ ఇన్ఫెక్షన్‌ బాధ నుండి బయట పడవచ్చు
►అల్లం ముక్కని ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఇందులో చిటికెడు జీలకర్ర పొడి, పంచదార కలిపి తింటే దగ్గు తగ్గుముఖం పడుతుంది.
►నెలసరి నొప్పితో బాధపడేవారు క్రమం తప్పకుండా ప్రతిరోజు ఒక ఉసిరికాయను తింటే ఉపశమనం లభిస్తుంది.
►పంటి నెప్పితో బాధ పడేవారు, ఒక లవంగాన్ని పంటికింద ఉంచితే మంచి ప్రభావం ఉంటుంది.

మరిన్ని వార్తలు