ఏకాంతం... అరణ్య సంచారం

10 Mar, 2015 23:39 IST|Sakshi

స్వప్నలిపి
 
‘నేనెప్పుడూ అడవి ముఖం చూడలేదు. అదేమిటో రాత్రి వచ్చిన కలలో... నేను ఒక్కడినే అడవిలో తిరుగుతున్నాను’
 ఇలాంటి మాటలు మనకు అప్పుడప్పుడూ వినిపిస్తుంటాయి. అడవిని ఎప్పుడూ చూడని వాళ్లకు కూడా ఇలాంటి కలలు ఎందుకు వస్తాయి?

గృహసంబంధిత అశాంతి, వ్యాపారంలో వచ్చిన నష్టం... ఇలా రకరకాల బాధలను అడవిలో సంచరించడం అనే కల ప్రధానంగా ప్రతిబింబిస్తుంది. ఇక రచయితలకు ఇదే కల వస్తే... వేరే అర్థాన్ని సూచిస్తుంది. తాము చేసిన రచనకు జనం నుంచి విపరీతమైన స్పందన వచ్చినప్పుడు సహజంగా రచయితలకు ఇలాంటి కలలు వస్తుంటాయి. రచయితలు అంతర్ముఖులు కాబట్టి... తమ సంతోషాన్ని ఇలా ఒంటరిగా అడవిలో తిరుగుతూ ప్రకృతితో పంచుకుంటారు. ఎప్పుడూ జనాల మధ్యలో ఉండే వాళ్లకు అప్పుడప్పుడు ప్రైవిసీ కావాలనిపిస్తుంది.

ఎవరితోనూ మాట్లాడకుండా ఏకాంతంగా గడపాలనిపిస్తుంది. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల అది తీరని కోరికే అవుతుంది. ఈ కోరిక కలలో ‘అడవి సంచారం’గా దర్శనమిస్తుంది. మరొకటి ఏమిటంటే, మన అంతఃచేతనలో తిరుగాడే సహజకోరికలు, కాల్పనిక ప్రపంచాన్ని కూడా ఈ అడవి కల ప్రతిబింబిస్తుంది.
 
 

మరిన్ని వార్తలు