ట్రాపిస్ట్‌–1 గ్రహాల్లో  బోలెడంత నీరు!

30 Apr, 2018 00:01 IST|Sakshi

ట్రాపిస్ట్‌ –1 పేరు గుర్తుందా?  కొన్నేళ్ల క్రితం సౌరకుటుంబానికి ఆవల గుర్తించిన గ్రహ వ్యవస్థ పేరిది. మొత్తం ఏడు గ్రహాలు ట్రాపిస్ట్‌–1 పేరుపెట్టిన ప్రత్యేక నక్షత్రం చుట్టూ తిరుగుతూంటాయి. వీటిల్లో కొన్నింటిపై నీరు ఉండేందుకు అవకాశం ఉందని అప్పట్లోనే అంచనాలు వేశారు. అయితే తాజా అంచనాలు మాత్రం నీరు కొంచెం ఉండటం కాదు.. మన సముద్రాల్లోని నీటి కంటే కనీసం 250 రెట్లు ఎక్కువ నీరు ఆ గ్రహాలపై ఉండే అవకాశముందని చెబుతున్నాయి. యూరోపియన్‌ యూనియన్‌ నిధులతో జరుగుతున్న స్పెక్యులూస్‌ ప్రాజెక్టు శాస్త్రవేత్తలు ఈ తాజా అంచనాలను వెలువరించారు.

ట్రాపిస్ట్‌–1 గ్రహ వ్యవస్థలో నక్షత్రానికి దగ్గరగా ఉన్న గ్రహాల్లో దట్టమైన ఆవిరితో కూడిన వాతావరణం ఉంటుందని.. దూరంగా ఉన్న గ్రహాలు మాత్రం మంచుతో కప్పబడి ఉంటాయని శాస్త్రవేత్తల అంచనా. దాదాపు మూడు గ్రహాల్లో ఉదజని వాయువు లేకపోవడాన్ని బట్టి వాటిపై జీవం ఉండే అవకాశాలు లేకపోలేదని అంచనా. రెండేళ్ల తరువాత నాసా, యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీలు ప్రయోగించబోయే అత్యాధునిక ‘జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోపు’తో ఈ గ్రహ వ్యవస్థకు సంబంధించిన వివరాలు మరిన్ని తెలుస్తాయని అంచనా. 

మరిన్ని వార్తలు