చర్మ సౌందర్యానికి పుచ్చకాయ

2 Apr, 2019 00:07 IST|Sakshi

బ్యూటిప్‌

టేబుల్‌ స్పూన్ల పుచ్చకాయ రసంలో 1 టేబుల్‌ స్పూన్‌ తేనెని కలిపి ఆ మిశ్రమాన్ని మీ ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాలు పాటు ఆరనిచ్చి తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇది మీ చర్మానికి కావాల్సిన తేమను సమకూర్చి మీ చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది.

టేబుల్‌ స్పూన్ల పుచ్చకాయ రసంలో 1 టేబుల్‌ స్పూన్‌ పెరుగు కలిపి ముఖంపై పట్టించాలి. 15 నిమిషాల పాటు ఆరనిచ్చి తర్వాత చల్లని నీటితో ముఖాన్ని కడిగేసుకోవాలి. పెరుగులోని లాక్టిక్‌ యాసిడ్‌ చర్మాన్ని మృదువుగా, కోమలంగా మార్చేస్తుంది. 

టేబుల్‌ స్పూన్ల పుచ్చకాయ రసంలో గుజ్జుగా చేసిన అవకాడో పండుని కలిపి ఈ మిశ్రమాన్ని మీ ముఖం  మెడ మీద పట్టించాలి. 20 నిమిషాలు తర్వాత మీ ముఖాన్ని చల్లని నీటితో కడగాలి. 

మరిన్ని వార్తలు