వెన్ను మార్గంలోకి మెదడు!

16 Mar, 2016 23:09 IST|Sakshi
వెన్ను మార్గంలోకి మెదడు!

మెడిక్షనరీ

మెదడుకు ఉన్న స్థలం సరిపోక కొందరిలో అది వెన్ను మార్గంలోకి జారుతుంది. ఈ కండిషన్‌నే కెయరీ మాల్‌ఫార్మేషన్ అనీ లేదా ఆర్నాల్డ్ కెయరీ మాల్‌ఫార్మేషన్ అని అంటారు. ఇది చాలా అరుదైన కండిషన్. ఇలా జరిగినప్పుడు మెదడులోంచి వెన్నుపాములోకి వెళ్లే ఫొరామెన్ మాగ్నమ్ అనే చిన్న దారిలోంచి మెదడులోని సెరెబెల్లమ్ వెన్ను మార్గంలోకి ప్రవేశిస్తుంది.

ఆ కండిషన్ ఏర్పడినప్పుడు రోగుల్లో తలనొప్పి, అలసట, కొన్ని కండరాలు బలహీనం కావడం, మింగడంలో ఇబ్బంది, గొంతులో ఏదో అడ్డుపడ్డట్లుగా ఉండటం, మగత, వికారం, చెవిలో గుయ్ అనే శబ్దం, మెడనొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఎమ్మారై పరీక్ష ద్వారా కెయరీ మాల్‌ఫార్మేషన్‌ను నిర్ధారణ చేస్తారు. దీనికి సర్జరీ / డీకంప్రెసివ్ సర్జరీతో పాటు ఆయా లక్షణాలను తగ్గించే మేనేజ్‌మెంట్ వంటివి చేసి చికిత్స అందిస్తారు.
 

 

మరిన్ని వార్తలు