నీరసంతో తల తిరుగుతుంటే...

22 Jul, 2014 00:08 IST|Sakshi
నీరసంతో తల తిరుగుతుంటే...

గృహవైద్యం
 
వయసుతో నిమిత్తం లేకుండా చాలామందికి తరచుగా కానీ అప్పుడప్పుడూ కానీ, తల తిరుగుతుంటుంది. ఇందుకు ఆహారంలో కొద్దిపాటి మార్పులు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
 
ఆహారాన్ని తక్కువసార్లు ఎక్కువ మోతాదులో తీసుకోవడం కంటే తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తీసుకోవాలి. అలా చేసినప్పుడు జీర్ణక్రియ సక్రమంగా జరగడంతోపాటు రోజంతా శక్తి విడుదల అవుతుంటుంది.
 
పుల్లని పండ్లను తీసుకోవాలి. ముఖ్యంగా ప్రయాణాల్లో తల తిరిగినట్లుండే వాళ్లు రోజుకు రెండు బత్తాయి లేదా కమలాపండ్లను తీసుకోవాలి. అలాగే నిమ్మకాయను దగ్గర ఉంచుకుని వాసన పీలుస్తుంటే తల తిరగడం, వాంతి వస్తున్న భావన కలగవు.
     
ఆహారంలో ఐరన్ పుష్కలంగా లభించడానికి ఆకుకూరలు, కాయగూరలు, కోడిగుడ్లు తీసుకోవాలి. అయినప్పటికీ ఐరన్‌లోపంతో బాధపడుతున్నట్లయితే డాక్టర్ సలహాతో ఐరన్ మాత్రలు తీసుకోవాలి. దేహంలో ‘సి’ విటమిన్ లోపిస్తే ఆహారంలో తీసుకున్న ఐరన్ దేహానికి పట్టదు. కాబట్టి ఐరన్ లోపాన్ని పరిష్కరించుకోవడానికి పుల్లటి పండ్లను తినాలి.
 
ఎంతటి పని ఒత్తిడిలో ఉన్నప్పటికీ ఆహారాన్ని వేళ తప్పించరాదు. ఒకవేళ భోజనం చేయాల్సిన సమయానికి భోం చేయడం కుదరకపోతే ఒక పండు లేదా బలవర్ధకమైన చిరుతిండి అయినా తినాలి.
 

మరిన్ని వార్తలు