రారండోయ్‌

27 Jan, 2020 00:41 IST|Sakshi
  • తెలంగాణ బడిపిల్లల కథలు ఆవిష్కరణ జనవరి 29న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ చిక్కడపల్లిలోని వట్టికోట ఆళ్వారుస్వామి నగర గ్రంథాలయంలో జరగనుంది. సంపాదకులు: మణికొండ వేదకుమార్‌. నిర్వహణ: చెలిమి, చిల్డ్రన్స్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ. 
  • అదృష్టదీపక్‌ సప్తతిపూర్తి అభినందన సభ ఫిబ్రవరి 1న సాయంత్రం 6 గంటలకు విజయవాడ ప్రెస్‌ క్లబ్‌లో జరగనుంది. ఇందులో దీపక్‌ వ్యాసాలు ‘తెరచిన పుస్తకం’, దీపక్‌పై వ్యాసాలు ‘దీపం’ ఆవిష్కరణ కానున్నాయి. ఆవిష్కర్తలు: కొప్పర్తి, పెనుగొండ లక్ష్మీనారాయణ. నిర్వహణ: ఎక్స్‌రే.
  • రాజ్యాంగ పరిరక్షణ కోసం ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఫిబ్రవరి 2న బహుజన సాహిత్య జాతర జరగనుంది. రోజంతా జరిగే సదస్సులో ఉపన్యాసాలు, కవిగాయక సభ ఉంటాయి. వివరాలకు: గోగు శ్యామల, ఫోన్‌: 9866978450
  • మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి సదాశివ పంచాశికపై సామవేదం షణ్ముఖ శర్మ ఫిబ్రవరి 2న ఉదయం 10 గంటలకు రాజమండ్రిలోని విరించి వానప్రస్థాశ్రమంలో ప్రసంగిస్తారు. నిర్వహణ: మధునాపంతుల ట్రస్టు.
  • ముదిగంటి సుజాతారెడ్డి సాహిత్య రంగంలోకి ప్రవేశించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తేనున్న ‘బహుముఖీన’ అభినందన సంచికకు ఫిబ్రవరి 15లోగా వ్యాసాలు పంపాల్సిందిగా కోరుతున్నారు గంటా జలంధర్‌ రెడ్డి. ఫోన్‌: 9848292715
  • సామాజిక స్పృహ అంశంతో కథ, కవిత, కార్టూన్ల పోటీ నిర్వహిస్తున్నాయి అర్చన ఫైన్‌ఆర్ట్స్‌ అకాడెమీ(హ్యూస్టన్‌), శారద సత్యనారాయణ మెమోరియల్‌ సొసైటీ. బహుమతుల మొత్తం: రూ. 30 వేలు. యూనికోడ్‌లో మార్చి 5లోపు పంపాలి. మెయిల్‌: rachanalu2020@gmail.com
మరిన్ని వార్తలు