వారఫలాలు (23 ఫిబ్రవరి నుంచి 29 వరకు)

23 Feb, 2020 07:06 IST|Sakshi

 వారఫలాలు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
సంఘంలో విశేష గౌరవమర్యాదలు పొందుతారు. కుటుంబపరంగా ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి నిర్మాణాలు ప్రారంభిస్తారు. కొత్త కాంట్రాక్టులు కొన్ని దక్కించుకుంటారు. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. వస్తు, వస్త్రలాభాలు. ఆర్థికంగా మరింత బలం చేకూరుతుంది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో పైమెట్టుకు చేరుకుంటారు. రాజకీయ,పారిశ్రామికవర్గాలకు సన్మానాలు, విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. పసుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం మంచిది.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. పనులు విజయవంతంగా సాగుతాయి. వాహన, గృహయోగాలు. వ్యాపారాలు కొత్త పెట్టుబడులతో ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో మీ మాటే చెల్లుబాటు కాగలదు. రాజకీయ, కళారంగాల వారికి విదేశీ పర్యటన లు. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఎరుపు, గులాబీ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. 

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ముఖ్యమైన వ్యవహారాలు  నిదానంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. తీర్థయాత్రలు చేస్తారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వాహనాలు, భూములు కొంటారు.  వేడుకలు, విందువినోదాలలో పాల్గొంటారు. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు, చిక్కులు తొలగుతాయి. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ఊహించని అభివృద్ధి కనిపిస్తుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. బంధువర్గంతో తగాదాలు. గులాబీ, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.   

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
కుటుంబ సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంఘంలో గౌరవం మరింత పెరుగుతుంది. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వాహనయోగం. వివాహయత్నాలు సానుకూలమవుతాయి. నిరుద్యోగులకు  ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగుపడి పుంజుకుంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు రావచ్చు. రాజకీయ,పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతమైన కాలం. వారం మధ్యలో కుటుంబంలో చికాకులు. ఆరోగ్యభంగం. నీలం, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి. 

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ముఖ్యమైన పనులలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. కొన్ని బాకీలు వసూలవుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక  కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో చిక్కులు తొలగి ఊరట చెందుతారు. ఉద్యోగాలలో బాధ్యతలు కొన్ని తగ్గుతాయి. రాజకీయ, కళారంగాల వారికి అనుకోని అవకాశాలు దక్కుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రుల నుంచి ఒత్తిడులు. గులాబీ, ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.


కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఊపందుకుంటాయి. సన్నిహితుల నుంచి మాట సహాయం అందుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అందరిలోనూ ప్రత్యేకత చాటుకుంటారు. మీ ఊహలు కొన్ని నిజం చేసుకుంటారు. కొత్త నిర్ణయాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తాయి. ఆస్తి వివాదాలు తీరతాయి.  చిన్ననాటి మిత్రులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో  పదోన్నతులు రావచ్చు. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు, విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం ప్రారంభంలో అనుకోని ఖర్చులు. ఇంటాబయటా ఒత్తిడులు. అనారోగ్యం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. సత్యనారాయణస్వామి స్తోత్రాలు పఠించండి..

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
కొత్త వ్యూహాలతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. పనులు చకచకా పూర్తి చేస్తారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు ఫలితాలు ఊరటనిస్తాయి. వాహనాలు, ఆభరణాలు సమకూర్చుకుంటారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు మరింత ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు. మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. గులాబీ, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. 

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణాలు తీరతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. సోదరులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. తీర్థయాత్రలు చేస్తారు. సేవా కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. పరిచయాలు పెరుగుతాయి వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో  ఉన్నత హోదాలు. పారిశ్రామిక, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు. వారం మ«ధ్యలో ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. పసుపు, ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. 

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు.  ఏ పని చేపట్టినా మందకొడిగానే సాగుతుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు శ్రమాధిక్యం. బంధువులతో అకారణంగా వివాదాలు. ఆరోగ్య సమస్యలు కాస్త చికాకు పరుస్తాయి. ఆస్తుల వ్యవహారాలలో కొద్దిపాటి చికాకులు. వాహనాలు, గృహం కొనుగోలులో ఆటంకాలు. సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు.  వ్యాపారాలు నిదానంగా సాగి స్వల్ప లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు. రాజకీయ, కళారంగాల వారికి ఒత్తిడులు తప్పవు. వారం మధ్యలో శుభవార్తలు. మిత్రుల నుంచి ఆహ్వానాలు. గులాబీ, లేత పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగుల జీవితాశయం నెరవేరుతుంది. సన్నిహితుల  నుంచి శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. పట్టుదలతో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. వాహనాలు, భూములు కొంటారు. తరచూ తీర్థయాత్రలు చేస్తారు.  వ్యాపారాలలో చికాకులు తొలగి లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతులు దక్కే అవకాశం. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు అరుదైన ఆహ్వానాలు రాగలవు. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. నీలం, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
విద్యార్థుల శ్రమకు ఫలితం కనిపిస్తుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సోదరులతో వివాదాలు పరిష్కారం. వాహన సౌఖ్యం. భూములు, గృహం కొనుగోలు చేస్తారు. ఆస్తుల విషయంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో ప్రమోషన్లు రాగలవు. రాజకీయ, కళారంగాల వారికి సన్మానయోగం. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి. 

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గానే ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. పరిచయాలు పెరుగుతాయి. వాహనసౌఖ్యం. మీ నిర్ణయాలు అందరూ ఆమోదిస్తారు. సోదరులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులకు పట్టింది బంగారమే. వారం చివరిలతో ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి కొద్దిపాటి సమస్యలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి. 
- సింహంభట్ల సుబ్బారావు , జ్యోతిష్య పండితులు 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు