వారఫలాలు (5 ఏప్రిల్‌ నుంచి 11 ఏప్రిల్‌)

5 Apr, 2020 10:26 IST|Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆర్థికంగా బలం చే కూరుతుంది. కొత్త వ్యక్తుల పరిచయం. బంధువుల నుంచి శుభవార్తలు. ఆస్తి తగాదాలు కొంత పరిష్కారమవుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. మీరంటే కుటుంబంలో మరింత ప్రేమ చూపుతారు. వస్తులాభాలు. నిరుద్యోగుల యత్నాలు కొంత మందగిస్తాయి. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో కొంత అనుకూలస్థితి. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో విభేదాలు. పసుపు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
కొత్త పనులు చేపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. చిన్ననాటి మిత్రుల కలయిక. ఇంటిలో శుభకార్యాలపై చర్చలు  జరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు.   వారం మధ్యలో ధనవ్యయం. అనుకోని ప్రయాణాలు. ఎరుపు, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
చిన్ననాటి మిత్రుల కలయిక. శుభకార్యాలలో పాల్గొంటారు. తలపెట్టిన పనులు చకచకా ముందుకు సాగుతాయి. కుటుంబ సమస్యలు తీరి కొంత ఊరట చెందుతారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. వ్యతిరేక పరిస్థితులు కూడా అనుకూలిస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో  ఉత్సాహంగా సాగుతారు.  కళాకారులకు ఊహించని పిలుపు అందుతుంది. వారం చివరిలో ఆరోగ్యభంగం, కొంత శ్రద్ధ అవసరం. బంధువులతో తగాదాలు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది.. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. పనులు నెమ్మదిగా సాగుతాయి. సోదరులు, మిత్రులతో అకారణంగా వివాదాలు. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్య విషయంపై శ్రద్ధ వహించండి. వ్యాపారాలు సామాన్యమైన లాభాలతో నడుస్తాయి.  ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు కొంత గందరగోళంగా ఉంటుంది. వారం మధ్యలో ధన, వస్తులాభాలు. విందువినోదాలు. ఆస్తిలాభం. ఆకుపచ్చ, గోధుమరంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. రుణాలు తీరతాయి. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. బంధువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. భూవివాదాల కొంత పరిష్కారం. విద్యార్థులకు ఉత్సాహవంతమైన కాలం. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాలలో మరింత పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి, పైస్థాయి నుంచి ప్రశంసలు అందుతాయి. కళారంగం వారి సేవలకు గుర్తింపు లభిస్తుంది.  వారం మధ్యలో ధనవ్యయం. ‡ప్రయాణాలు వాయిదా వేస్తారు. తూర్పుదిశ ప్రయాణాలు సానుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
అనుకున్న పనులు సజావుగా పూర్తి చేస్తారు. బంధువులు, మిత్రులతో వివాదాల పరిష్కారం. శుభకార్యాలపై చర్చలు జరుపుతారు.  రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. పరిచయాలు మరింత పెరుగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. కళాకారులు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. వారం  ప్రారంభంలో బంధువులతో తగాదాలు. ఆస్తి వివాదాలు. ఎరుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం.  ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం రాగలదు.ఆస్తుల కొనుగోలులో సమస్యలు తీరతాయి. వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. రాజకీయవర్గాలకు శ్రమ ఫలిస్తుంది.  వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. ధనవ్యయం. పసుపు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.  సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
పనులు సకాలంలోనే పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. భూవివాదాలు తీరతాయి. ఆలోచనలు కలసివస్తాయి. సంఘంలో విశేష గౌరవమర్యాదలు పొందుతారు. ప్రముఖులతో  చర్చలు ఫలిస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలలో కదలికలు ఉంటాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వ్యాపారాలలో అనుకూలత, అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు.  వారం మధ్యలో ధనవ్యయం. ఇంటాబయటా బాధ్యతలు. దైవదర్శనాలు. ఎరుపు, గులాబీ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
కొత్త విషయాలు తెలుస్తాయి. సమాజంలో ప్రత్యేక గౌరవం పొందుతారు.  మీ సత్తా అందరిలోనూ చాటుకుంటారు. విద్యావకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు శ్రమ ఫలించే సమయం. వారం ప్రారంభంలో ఇంటాబయటా ఒత్తిడులు. అనారోగ్య సూచనలు. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
 బంధువులతో తగాదాలు పరిష్కారం. శుభకార్యాలకు ప్రణాళిక రూపొందిస్తారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ఆస్తుల విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. వాహనాలు, భూములు కొంటారు.  వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. అనారోగ్యం. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
పలుకుబడి పెరుగుతుంది. ఇంటాబయటా మీకు ఎదురులేని పరిస్థితి ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఆలోచనలు కలసివస్తాయి. ఆధ్యాత్మిక  కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు. మీ ఆశయాలు నెరవేరతాయి. స్థిరాస్తి వివాదాలు కొంత పరిష్కారమయ్యే అవకాశం. వస్తులాభాలు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. కళారంగం వారికి ఆశలు ఫలిస్తాయి. వారం మధ్యలో ధనవ్యయం.  కుటుంబంలో ఒత్తిళ్లు. నీలం, ఆకుపచ్చ రంగులు.  తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. వినాయక స్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థికంగా మరింత బలం చేకూరుతుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. బంధువులు, మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగే సమయం. ఆలయాలు సందర్శిస్తారు. మీ ఖ్యాతి మరింత పెరుగుతుంది. నూతన ఉద్యోగయత్నాలలో కొంత పురోగతి సాధిస్తారు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు అరుదైన అవకాశాలు దక్కవచ్చు. వారం చివరిలో వ్యయప్రయాసలు. కుటుంబసభ్యులతో వివాదాలు. గులాబీ, ఎరుపురంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
-సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు 

మరిన్ని వార్తలు