ప్రేమలో ఉన్నారా.. ఈ వారం మీ జాతకం తెలుసుకోండి!

15 Nov, 2019 11:01 IST|Sakshi

మేషం : వీరికి శుక్ర, శనివారాలు ప్రేమసందేశాలు, పెళ్లి ప్రతిపాదలు చేసేందుకు అనుకూలమైన రోజులు. ఇదే సమయంలో అవతలి వ్యక్తుల నుంచి అనుకూల సందేశాలు రావచ్చు. ప్రేమ ప్రయత్నాలు చేసేవారు గ్రీన్, ఎల్లో రంగు దుస్తులు ధరించండి. ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరండి.
 

వృషభం : ప్రేమ వ్యవహారాలు మొదలుపెట్టడానికి ఆది,సోమవారాలు శుభదాయకమైనవి. ఈ రోజుల్లో మీ ప్రతిపాదనలు పంపేందుకు, నేరుగా తెలియజేసేందుకు అనువైనవి. అలాగే, కోరుకున్న వ్యక్తులు మీ పట్ల సానుకూలత వ్యక్తం చేయవచ్చు. ప్రపోజ్‌ చేయటానికి వెళుతున్న సమయంలో క్రీమ్, గోల్డ్‌ రంగు దుస్తులు ధరించండి. అలాగే, ఇంటి నుంచి ఉత్తర వాయువ్యం దిశగా బయలుదేరండి.

మిథునం : మీరు ఇష్టపడే వారికి ప్రేమ ప్రతిపాదనలు చేసేందుకు శుక్ర, గురువారాలు అనుకూలమైనవి. ఈ రోజుల్లో మీ సందేశాలకు అనుకూల స్పందనలు రావచ్చు. అలాగే, ప్రేమ ప్రతిపాదనలు చేసే సమయంలో  పింక్, వైట్‌ రంగు దుస్తులు ధరించండి. ప్రేమకు సంబంధించిన పనులు మొదలుపెట్టేముందు ఇంటి నుంచి దక్షిణ ఆగ్నేయదిశగా బయలుదేరితే సానుకూల వాతావరణం ఉంటుంది.

కర్కాటకం : మీకు ఇష్టమైన వ్యక్తులకు మీ అభిప్రాయాలు వెల్లడించేందుకు ఆది, సోమవారాలు అనుకూలమైనవి. ఈ రోజుల్లో మీరు ప్రేమించే వారి నుంచి సైతం అనుకూల సందేశాలు అందే సూచనలు. మనస్సులోని భావాలు తెలియజేసే సమయంలో గ్రీన్, ఎల్లో రంగు దుస్తులు ధరించండి. ప్రేమ ప్రతిపాదనలు చేయటానికి వెళుతున్నట్లయితే పశ్చిమదిశగా ఇంటి నుంచి బయలుదేరండి.

సింహం : మీ మనస్సులోని భావాలను మీరు కోరుకున్న వ్యక్తులకు తెలియజేసేందుకు శుక్ర, గురువారాలు ఉత్తమమైనవి. ఈ రోజుల్లో మీరు ఇష్టపడే వ్యక్తుల నుంచి సైతం సానుకూల వైఖరి కనపడుతుంది. ప్రపోజ్‌ చేయటానికి వెళుతున్న సమయంలో రెడ్, ఆరెంజ్‌ రంగు దుస్తులు ధరించండి. ఉత్తర ఈశాన్య దిశగా ఇంటి నుంచి బయలురేరితే శుభాలు కలుగుతాయి.

కన్య : వీరికి శుక్ర, శనివారాలు విశేషమైనవిగా చెప్పాలి. ఈ రోజుల్లో ప్రేమ, పెళ్లి ప్రతిపాదనలు చేయటానికి అనుకూలమైనవి. ఈ సమయంలో మీరు ప్రేమించే వారి నుంచి కూడా మీపై ప్రేమాభిమానాలు ఏర్పడవచ్చు. ఈ సమయంలో మీరు వైట్, పింక్‌ రంగు దుస్తులు ధరించండి. అలాగే,  తూర్పుదిశగా ఇంటి నుంచి బయలుదేరండి.

తుల : మీ మనస్సులోని భావాలు ఇష్టులైన వారికి తెలియజేసేందుకు  మంగళ, గురువారాలు అనుకూలమైనవి. ఈ రోజుల్లో మీ ప్రేమ ప్రతిపాదనలకు అనుకూల స్పందనలు రావచ్చు. ప్రేమ ప్రతిపాదనలు చేసే సమయంలో గోల్డ్, ఎల్లో రంగు దుస్తులు ధరించండి. ఇంటి నుంచి దక్షిణదిశగా బయలుదేరండి. 

వృశ్చికం : వీరు తమ ప్రేమను కోరుకున్న వ్యక్తులకు తెలియజేసేందుకు బుధ, గురువారాలు శుభదాయకంగా ఉంటాయి. ఈ రోజుల్లో మీ ప్రియమైన వారి నుంచి కూడా సానుకూల సందేశాలు అందే సూచనలు. ఇక ప్రేమ ప్రతిపాదనలు అందించే సమయంలో రెడ్, వైట్‌ రంగు దుస్తులు ధరించండి. అలాగే, తూర్పు ఆగ్నేయదిశగా ఇంటి నుంచి బయలుదేరండి.

ధనుస్సు : మీ ప్రియమైన వ్యక్తులకు మనస్సులోని భావాలను వెల్లడించేందుకు శుక్ర,శనివారాలు సానుకూలమైనవి. ఈ రోజుల్లో మీరు  కోరుకున్న వ్యక్తుల నుంచి కూడా అనుకూల సందేశాలు రావచ్చు. మీరు మీ లవ్‌ను ప్రపోజ్‌ చేయటానికి వెళుతుంటే  గ్రీన్,  ఎల్లో రంగు దుస్తులు ధరించండి. ప్రేమకు సంబంధించి ఎటువంటి పనులు మొదలుపెట్టడానికైనా పశ్చిమ వాయువ్యదిశగా ఇంటి నుంచి బయలుదేరితే శుభం కలుగుతుంది.

మకరం : వీరికి శని, ఆదివారాలు కలిసివచ్చే రోజులుగా చెప్పవచ్చు. ఈ కాలంలో మీ ప్రేమను తెలియజేయటానికి అనువైనవి. అలాగే, ఈ రోజులలో మీరు ప్రేమించే వారి నుంచి కూడా అనుకూల సందేశం అందవచ్చు. మీరు ప్రేమ ప్రతిపాదనలు చేసే సమయంలో పింక్, రెడ్‌ రంగు దుస్తులు ధరించండి. అలాగే, ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరండి.

కుంభం : వీరు ఇష్టమైన వ్యక్తులకు ప్రతిపాదనలు చేసేందుకు శుక్ర, శనివారాలు అనుకూలమైనవి. ఈ రోజులలో కోరుకున్న వ్యక్తుల నుంచి సైతం మీపట్ల సానుకూలత  వ్యక్తం కావచ్చు. ప్రేమకు సంబంధించిన ప్రయత్నాలు చేసే సమయంలో ఎల్లో , వైట్‌ రంగు దుస్తులు ధరిస్తే మేలు. ఇక పశ్చిమదిశగా ఇంటి నుంచి బయలుదేరండి. 

మీనం : వీరికి బుధ,గురువారాలు విశేషమైనవిగా చెప్పవచ్చు. ఈ రోజులలో తమలోని భావాలను ఇష్టులకు వెల్లడించేందుకు అనుకూలం. అలాగే, అవతలి వ్యక్తుల నుంచి కూడా మీపట్ల ప్రేమాభిమానాలు కలుగవచ్చు. ఇక ఇటువంటి ప్రతిపాదనలు చేసే వారు గ్రీన్, పింక్‌ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఇక ఇంటి నుంచి ఉత్తర దిశగా బయలుదేరండి.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు