టీనేజీలో పెరిగే బరువు... పెద్దయ్యాక తేవచ్చు పక్షవాతం ముప్పు!

29 Jun, 2017 23:32 IST|Sakshi
టీనేజీలో పెరిగే బరువు... పెద్దయ్యాక తేవచ్చు పక్షవాతం ముప్పు!

పరిపరిశోధన

టీనేజీలోపే..
. అంటే ఎనిమిది నుంచి 20 ఏళ్ల వయసులోపు ఉన్న చిన్నారులు ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా పెరుగుతున్నారా? ఆ పెరుగుదల ఆందోళనకరం అంటున్నారు స్వీడన్‌ శాస్త్రవేత్తలు. ఎనిమిది నుంచి ఇరవై ఏళ్ల వయసులో పిల్లలు ఎంత ఎక్కువ బరువు పెరుగుతుంటే... పెద్దయ్యాక వాళ్లలో పక్షవాతం (స్ట్రోక్‌) వచ్చే ముప్పు అంత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు స్వీడన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ గోథెన్‌బర్గ్‌కు చెందిన అధ్యయనవేత్తలు. వాళ్ల బాడీ మాస్‌ ఇండెక్స్‌ (బీఎమ్‌ఐ)లో ప్రతి రెండు పాయింట్ల పెరుగుదలతో పక్షవాతం వచ్చే రిస్క్‌ 20 శాతం పెరుగుతుందని వారు హెచ్చరిస్తున్నారు.

అంత ఎక్కువగా పెరిగిన బరువు కారణంగా... అలాంటి పిల్లల్లో ఆ ఊబకాయానికంతా రక్తం అందించలేక, రక్తనాళాల సామర్థ్యం తగ్గుతుందనీ, దాంతో పెద్దయ్యాక వారిలో మెదడుకు సరిగా రక్తం అందక  పక్షవాతం వచ్చే అవకాశాలు పెరుగుతాయన్నది వారి విశ్లేషణ. అందుకే టీనేజీలో పిల్లలు బరువు పెరుగుతుంటే, దాన్ని నియంత్రించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మేలని వారు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు