అధిక బరువుతో బాధపడుతున్నారా..

5 Mar, 2020 15:29 IST|Sakshi

అధిక బరువు.. అనేక మందిని పట్టి పీడిస్తున్న ఓ పెద్ద సమస్య. చాలమంది బరువు తగ్గడానికి నానా తాంటాలు పడుతుంటారు. వెయిట్‌ లాస్‌ సెంటర్లు, జిమ్‌లు, వ్యాయాయం, డైట్‌ వంటి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అయితే బరువు తగ్గడానికి సరైన వ్యాయామంతో పాటు ఆరోగ్యకరమై ఆహార నియమాలకు కూడా  అవసరం. పెరిగిన బరువు నుంచి తిరిగి మామూలు స్థితికి రావడానికి శ్రద్ధ, ఓపిక, అంకితభావం అవసరం. ఎంతో మందికి ఇష్టమైన ఆహరం తినాలని ఉంటుంది.

అలాగే బరువు కూడా తగ్గాలని ఉంటుంది.  తగ్గడం అనేది చాలా కష్టంలో కూడుకున్న​ విషయం. అనేక మంది ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటారు. బరువు తగ్గడం కోసం తమకు ఇష్టమైన ఆహారానికి దూరంగా ఉంటారు. అయితే చాలా రకాల డైట్‌లను పాటిస్తుంటారు. అయితే ఇప్పుడు చెప్పబోయే ఓ ఆహార పదార్థం మీకు చాలా ఇష్టం.. అలాగే దానితో బరువు కూడా తగ్గవచ్చు. ఈ సారి మీ డైట్‌లో డార్క్‌ చాక్లెట్‌ను చేర్చండి. ఇది బరువు తగ్గిస్తుంది.

డార్క్‌ చాక్లెట్‌ వల్ల కలిగే లాభాలు.
చాక్లెట్‌.. ఈ పేరు వినగానే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు లొట్టలేసుకుంటూ తింటారు, చాక్లెట్‌ రుచి చూడటానికి వయసుతో సంబంధం లేదు. అయితే వాటిని ఎక్కువగా తినడం వల్ల పళ్లు పుచ్చిపోతాయని చాలావరకు తల్లిదండ్రులు వద్దంటారు. కానీ అదే చాక్లెట్‌ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయన్న విషయం మీకు తెలుసా. కొంతమందికి ఇది తింటే ఆకలిని తగ్గిస్తుందని తెలుసు. కానీ చాక్లెట్‌తో మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు పరిశోధకులు. మరి ఆ ప్రయోజనాలెంటో తెలుసుకోవాలనుకుంటున్నారా. చాక్లెట్‌లలో చాలా రకాలు ఉంటాయి. అయితే ముఖ్యంగా డార్క్‌ చాక్లెట్‌ ను తింటే తప్పకుండా బరువు తగ్గవచ్చని అంటున్నారు వైద్యులు, డార్క్‌ చాక్లెట్లు తినడం వల్ల ఆరోగ్య లాభాలు మెండుగా ఉంటాయి. బరువు తగ్గడంతో పాటు.. పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వును తగ్గిస్తోంది. అదే విధంగా జీవక్రియను మెరుగు పరుస్తుంది. 

జీవక్రియను పెంచుతుంది :డార్క్ చాక్లెట్ ఎక్కువ శక్తిని అందిస్తుంది. ఆహారం త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. అలాగే జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. కేలరీలు త్వరగా కరిగించి శక్తిగా మార్చడానికి దోహదపడుతుంది.

షుగర్‌ లెవల్స్‌ పెరగకుండా తగ్గిస్తుంది: బ్లడ్ షుగర్ స్పైక్ అంటే శరీరంలో కొవ్వును కరిగించే వ్యవస్థ వృధాగా ఉండటం వల్ల త్వరగా ఆకలితో బాధపడతారు. డార్క్ చాక్లెట్ ఆరోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉంటుంది, ఇది రక్త ప్రవాహంలోకి షుగర్‌ రిలీజ్‌ను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది రక్తంలో షుగర్‌ లెవల్స్‌ను పెరగకుండా ఉండేందుకు సహాకరిస్తుంది.

ఆకలిని తగ్గిస్తుంది : చాక్లెట్‌ తినడం వల్ల ఆకలిని తగ్గించవచ్చు. ఆకలి వేసినప్పుడు 20 నిమిషాల ముదు చాక్లెట్‌ తినడం వల్ల కొన్ని గంటలపాటు ఆకలిని నిరోధించవచ్చు. అంతేగాక మెదడులోని హర్మొన్లను ప్రేరేపిస్తుంది.

నొప్పిని తగ్గిస్తుంది : డార్క్ చాక్లెట్ నొప్పిని తగ్గించే లక్షణాలను కలిగి ఉంటుంది. నెలసరి సమయంలో డార్క్ చాక్లెట్‌ను తీసుకోవడం వల్ల మంట, నొప్పిని తగ్గించవచ్చు. దీనిని డాక్టర్లు కూడా సిఫారసు చేస్తారు. వ్యాయామం స్థిరంగా ఉండటానికి సహాయపడుతుంది. ఇది బరువు తగ్గడానికి చాలా ముఖ్యమైనది.

జంక్‌ఫుడ్‌ అలవాటును తగ్గిస్తుంది : పిజ్జా, బర్గర్‌, వేపుడు వంటి వాటిని తినాలన్న ఆసక్తినిన డార్క్ చాక్లెట్ తగ్గిస్తుంది. డార్క్ చాక్లెట్‌ను దాదాపు ప్రతిరోజూ తినవచ్చు. జంక్‌ఫుడ్‌ను తగ్గించి నోటికి తాళం వేస్తుంది.

అనవసరపు ఆహారాన్ని తినాలన్న కోరికలను అరికడుతుంది : ఆహారంలో చేయవలసిన కష్టతరమైన విషయాలలో ఒకటి పిచ్చి తిండికి దూరంగా ఉండటం. ప్రతి ఒక్కరు  నచ్చిన వన్నింటని తినాలని అనకుంటారు. ఇష్టమైన ఆహారాన్ని అధికంగా తీసుకొని,  ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. కాబట్టి అలాంటి కోరికలను డార్క్‌ చాక్లెట్‌ అరికట్టుతుంది. 

మరిన్ని వార్తలు