వెయిట్‌ లిఫ్టింగ్‌తో గుండెకు మేలు

9 Jul, 2019 19:48 IST|Sakshi

లండన్‌ : హృదయనాళాల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో కార్డియో వ్యాయామాలతో పోలిస్తే వెయిట్‌ లిఫ్టింగ్‌ మేలని తాజా అథ్యయనం వెల్లడించింది. స్థూలకాయుల్లో గుండెలో పేరుకుపోయిన కొవ్వు ప్రమాదకరమని దీన్ని తగ్గించడంలో బరువులు ఎత్తడం, డంబెల్స్‌,పుషప్స్‌ వంటివి మెరుగైన వ్యాయామంగా ఉపకరిస్తాయని నిపుణులు పేర్కొన్నారు.

కార్డియో వ్యాయామాల జోలికి వెళ్లకుండా మూడు నెలల పాటు కేవలం వెయిట్‌ లిఫ్టింగ్‌ శిక్షణ తీసుకున్న స్థూలకాయుల్లో మూడింట ఒక వంతు హృదయనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు తగ్గుముఖం పట్టిందని శాస్త్రవేత్తల అథ్యయనంలో వెల్లడైంది. సరైన ఆహారం, వ్యాయామం ద్వారా రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి హృద్రోగాలకు దారితీసే పరిస్థితిని నివారించవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. కోపెన్‌హాగన్‌ యూనివర్సిటీ ఆస్పత్రికి చెందిన శాస్త్రవేత్తలు ఈ అథ్యయనం నిర్వహించారు. 

మరిన్ని వార్తలు